ఢిల్లీ నిర్భయ కేసులో కోర్టు దోషిగా ప్రకటించిన ముకేష్ సింగ్.. రేప్‌లు జరగడానికి అమ్మాయిలే కారణమని అంటున్నాడు . బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ఉరితీస్తే అది రేప్ బాధితురాళ్ళు ‘కనిపించకుండాపోతారనడానికి’కారణమవుతుందని అన్నాడు. అమ్మాయిలు తమ బాయ్‌ఫ్రెండ్స్ తో రాత్రి తొమ్మిదిగంటల తరువాత కూడా పబ్‌లు, బార్లు విజిట్ చేస్తూ షికార్లు కొడుతున్నారని, అందువల్లే వారి మీద అత్యాచారాలు జరుగుతున్నాయని సూచించారు. ఇందువల్లే మగాళ్ళకన్నా ఆడవాళ్లే అత్యాచారాలకు కారణమవుతున్నారు అని వ్యాఖ్యానించాడు. ఒక చేత్తో చప్పట్లు కొట్టలేం కదా సమర్థించుకున్నాడు. రేప్ జరుగుతున్నప్పుడు యువతి ప్రతిఘటించ కూడదని, సైలెంట్‌గా ఉండాలని సింగ్ చెబుతున్నాడు. ఇంకా ఇలాంటి పచ్చి వ్యాఖ్యలు చాలా చేశాడు. (అయితే ఐదేళ్లు కూడా నిండని చిన్నారులమీద కూడా హత్యాచారాలు జరుగుతున్నాయని, బెంగుళూరు వంటి నగరాల్లో ఇలాంటివి కామన్ అయ్యాయని సోషల్ నెట్‌వర్క్ లో కామెంట్లు పడుతుండడం విశేషం.) అటు అనేకమంది లాయర్లు సైతం ముకేష్ వ్యాఖ్యల్ని ఖండించారు. అతడు ఇలా మాట్లాడతాడని తాను ఊహించలేదని వాడి తరఫు డిఫెన్స్ న్యాయవాది వి.కే.ఆనంద్ అన్నారు. మరో లాయర్ ఏ.పీ.సింగ్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. రెండేళ్ళ క్రితం ఢిల్లీలో బస్సులో వెళ్తున్న యువతి మీద క్రూరంగా రేప్ చేసిన నిందితుల్లో ముకేష్ కూడా ఒకడు.
No comments:
Post a Comment