Friday 6 March 2015

అఖిల్ కు గైడెన్స్ ఇస్తున్న చరణ్

హీరోగా పరిచయం అవుతున్న అఖిల్ ఇప్పుడు హీరోగా ఎలా నిలబడాలనే విషయం పై ఫోకస్ చేసినట్టున్నాడు. అందుకే అన్ని రకాల అంశాలపై అవగాహనా పెంచుకుంటున్నాడు. ఇప్పటికే షూటింగ్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వినాయక్ రూపొందిస్తున్నాడు. అయతే అఖిల్ చరణ్ ల మద్య మంచి స్నేహం ఉంది. ఈ నేపద్యం లో చరణ్ లా మొదటి సినిమాతోనే మెప్పించేలా ప్లాన్ చేస్తున్నాడు అఖిల్ అందుకోసం చరణ్ సలహాలు కుడా తీసుకుంటున్నాడు. ఇప్పటికే చరణ్ అఖిల్ విషయం లో చాలా కేర్ తో ఉన్నాడట. అఖిల్ కు మంచి మంచి సలహాలు కుడా ఇస్తున్నాడట. సో అఖిల్ మొదటి సినిమాతోనే హీరోగా నిలబడడం ఖాయం. ఏమంటారు ? 

మొత్తానికి ఆ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోందట

మూడు సంవత్సరాలు షూటింగ్ జరుపుకొని ఓవర్ బడ్జెట్ తో ఇన్నాళ్ళు మూలన పడిఉన్న ''రేయ్ '' అనే చిత్రం ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అవుతోందట. గతకోన్నా ల్లుగా ఇదిగో -అదిగో రిలీజ్ అంటూ కాలయాపన చేసిన వై విఎస్ చౌదరి ఈనెల 27న మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేయనున్నట్లుచెబుతున్నారు.  మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సయామీ ఖేర్ ,శ్రద్దా దాస్ హీరోయిన్ లుగా వై విఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ''రేయ్ '' హిట్ అవుతుందని నమ్ముతు న్నాడు చౌదరి . మరి చౌదరి నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి . అసలు మార్చి 27న రిలీజ్ అవుతుందా లేక మళ్ళీ మరోసారి వాయిదా పడుతుందా చూడాలి .

చెన్నై కి మకాం మార్చిన చిన్నది

సౌత్ లో హాట్ క్రేజీ భామగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్లామర్ భామ , ఈ మద్య కోలీవుడ్ పై ఎక్కువ టార్గెట్ పెట్టినట్టు కనిపిస్తుంది. అందుకే మకాం ఇప్పుడు చెన్నై కి మార్చింది. ఆ భామ ఎవరో కాదు కాజల్. తెలుగు , తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు కోలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు వస్తుండడం తో తన టార్గెట్ కోలీవుడ్ పై పెట్టింది. అక్కడే ఉంటె మరిన్ని సినిమాలు చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టుంది అందుకే మకాం చెన్నై కి మార్చింది. తెలుగలో రెండు సినిమాల్లో నటిస్తున్న కాజల్ తమిళం ఏకంగా నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి ?

పవన్ తో ఆలి సినిమా

పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలపై ఎక్కువ దృష్టి సారించాడు. అందుకే వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. మరో వైపు తనతో సినిమాలు తీయాలనే నిర్మాతలకు కుడా అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యాడు. వచ్చే ఎన్నికల్లోపు అందరి సినిమాల్లో నటించాలనే ఆలోచనలో ఉన్నాడు. తాజాగా కమెడియన్ ఆలి నిర్మాతగా మారనున్నాడు. ఆలి పవన్ లు మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. అందుకనే ఆలి నిర్మాతగా మారుతూ పవన్ తో ఒ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ! అంతే కాదు పవన్ కుడా ఆలికి ఓ సినిమా చేస్తానని మంచి కథ తీసుకురా అని చెప్పాడట ! ఇప్పుడు ఆలి అదే పనిలో ఉన్నాడు. సో త్వరలో ఆలి నిర్మాతగా త్వరలోనే ఓ సినిమా రానుంది మరి ? 

Where Is Vidya Balan Telugu Movie Item Song Actress Spicy Photos

Telugu movie Where Is Vidya Balan item number heroine spicy stills. Where Is Vidya Balan item song actress spicy stills, Where Is Vidya Balan Telugu movie item song heroine latest photos, Telugu movie Where Is Vidya Balan item song actress spicy photos, Where Is Vidya Balan star cast Sampoornesh Babu, Jyothi Sethi latest stills, Where Is Vidya Balan item song heroine spicy picture, Where Is Vidya Balan Telugu movie item song actress spicy image.
















రోడ్డు ప్రమాదంలో నటి శారద కు గాయాలు

ప్రముఖ సీనియర్ నటి శారద కు ఈరోజు రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయలయ్యాయి. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద శారద ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో నటి శారద కు గాయాలయ్యాయి .  విజయవాడ నుండి హైదరాబాద్ కు వస్తున్న శారద కారు కి ఆకుపాముల గ్రామం వద్ద గేదెలు అడ్డు రావడంతో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పింది . గేదెలను తప్పించే క్రమంలో కారు కుదుపులకు లోను కావడంతో శారద కు గాయాలయ్యాయి . దాంతో నటి శారద మరో కారులో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ యాక్సిడెంట్ లో శారద స్వల్ప గాయాలతో బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు .

Holi celebration 2015