Friday 6 March 2015

రోడ్డు ప్రమాదంలో నటి శారద కు గాయాలు

ప్రముఖ సీనియర్ నటి శారద కు ఈరోజు రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయలయ్యాయి. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద శారద ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో నటి శారద కు గాయాలయ్యాయి .  విజయవాడ నుండి హైదరాబాద్ కు వస్తున్న శారద కారు కి ఆకుపాముల గ్రామం వద్ద గేదెలు అడ్డు రావడంతో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పింది . గేదెలను తప్పించే క్రమంలో కారు కుదుపులకు లోను కావడంతో శారద కు గాయాలయ్యాయి . దాంతో నటి శారద మరో కారులో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ యాక్సిడెంట్ లో శారద స్వల్ప గాయాలతో బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు .

No comments:

Post a Comment