Friday, 6 February 2015

'Malli Malli Idi Raani Roju' Review 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' మూవీ రివ్యూ




ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్ లో వ‌చ్చిన ల‌వ్ స్టోరి మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు. ఓన‌మాలు చిత్రంతో ఆశించిన స్థాయి విజ‌యాన్ని అందుకోలేక పోయిన ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. శ‌ర్వానంద్‌, నిత్యామీన‌న్ తొలిసారి జంట‌గా న‌టించిన చిత్రం. ర‌న్ రాజా ర‌న్ చిత్రం త‌ర్వాత శ‌ర్వానంద్ ఈ చిత్రం పై చాలా ఆశ‌ల‌నే పెట్టుకున్నాడ‌నాలి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది, ప్రేక్ష‌కుల ప్రేమ‌ను గెలుచుకుందా అని తెలుసుకోవాలంట క‌థ తెలుసుకోవాల్సిందే...

క‌థ‌
రాజారాం(శ‌ర్వానంద్ నేష‌న‌ల్ లెవ‌ల్‌లో రన్నింగ్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించాల‌నే కోరిక ఉన్న పేదింటి యువ‌కుడు. త‌ల్లి పార్వ‌త‌మ్మ‌తో క‌లిసి జీవిస్తుంటాడు. స్టేట్ లెవ‌ల్ పోటీలు జ‌రిగే సంద‌ర్భంలో నజీర(నిత్యామీన‌న్‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. న‌జీర కూడా రాజారాంను ఇష్ట‌ప‌డుతుంది. త‌న‌కి ముఖం చూపించ‌కుండా ఆట‌ప‌ట్టిస్తుంటుంది. రాజారాం త‌ల్లి ద‌గ్గ‌ర ఖానం అనే పేరుతో సంగీతం నేర్చుకుంటుంది. అయితే ఓ సంద‌ర్భంలో న‌జీర‌, ఖానం ఒక‌రేన‌ని నిజం రాజారాంకి తెలిసిపోతుంది. అయితే అనుకోని ప‌రిస్థితుల్లో వారిద్ద‌రూ విడిపోతారు. న‌జీర తానెక్క‌డున్న విష‌యాన్ని రాజారాంకి చెప్ప‌దు. అస‌లు రాజారాం, నజీర ఎందుకు విడిపోతారు? న‌జీర త‌న వివ‌రాల‌ను రాజారాం ఎందుకు తెలియ‌జేయ‌దు? అస‌లు ఇద్ద‌రూ క‌లుసుకుంటారా?  అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
 
న‌టీన‌టు ప‌నితీరు
శ‌ర్వానంద్‌, ర‌న్ రాజా ర‌న్ వంటి క‌మ‌ర్షియ‌ల్ హిట్ త‌ర్వాత కూడా డిఫ‌రెంట్‌గా ట్రై చేసిన ల‌వ్ స్టోరి. ఇందులో కాలేజీ యువ‌కుడిగా, మ‌ధ్య వ‌య‌స్కుడిగా రెండు షేడ్స్‌లో చ‌క్క‌గా న‌టించాడు. డైలాగ్స్ బాగా చెప్ప‌డమే కాకుండా మంచి ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చాడు. నిత్యామీన‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌ళ్ల‌తోనే భావాల‌ను ప‌లికిస్తూ ప్రేక్ష‌కుల మ‌దిని దోచేసింది. రియ‌ల్ ల‌వ‌ర్స్‌లాగా మంచి కెమిస్ట్రీ పండించారు. నిత్యామీన‌న్ కూడా రెండు షేడ్స్‌ను అద్భుతంగా చేసింది. పున‌ర్న‌వి, తేజ‌స్విని త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. నాజ‌ర్‌, సూర్య‌, చిన్నా ఇత‌ర న‌టీన‌టులు త‌మ ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు.
సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు
నిజ‌మైన ప్రేమ బ్రేక్ అప్‌ను కోరుకోదు. అలాగే త‌ప్ప‌కుండా గెలిచి తీరుతుందనే విష‌యం పాతదే అయిన‌ప్ప‌టికీ డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ ఆ పాయింట్‌ను చ‌క్క‌గా ప్రెజంట్ చేశాడు. అలాగే క‌థ‌కు త‌గిన న‌టీన‌టులను ఎంచుకోవ‌డంతో తొలి స్టెప్‌లోనే స‌క్సెస్ అయ్యాడు. అయితే సినిమా అంతా స్లోగా సాగుతుంది. ఎంతలా అంటే మూడు విష‌యాల‌ను చెప్పేలోప‌లే ఇంట‌ర్వెల్ వ‌చ్చేస్తుంది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌లో సెంటిమెంట్ ఆర్టిఫిషియ‌ల్‌గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్‌. చాలా చ‌క్క‌ని డైలాగ్స్ రాశాడు. ఫ‌స్టాఫ్‌లో డోస్ ఎక్కువ‌ని అనిపించినా సెకండాఫ్‌లో ఆ డోస్ స‌రిపోయింది. నాకెప్పుడూ దూరంగా ఉండేది ద‌గ్గ‌రైపోతుంది. ద‌గ్గ‌ర‌గా ఉండేది దూర‌మై పోతుంది..ఎందుకంటే నేను ర‌న్న‌ర్‌ని, బ్రేక్ అప్ చెప్పాల‌నుకున్న‌ప్పుడు చెప్పెయ్ ఎందుకంటే నిజమైన ల‌వ్‌కి బ్రేక్ అప్ ఉండ‌దు. గెలిచేవాడెప్పుడు ల‌క్ష్యంవైపు వెళుతుంటే.. ఓడిపోయేవాడు ఇత‌రుల‌ను ఎలా ఓడించాలా అని ఆలోచిస్తాడు.. వంటి చాలా డైలాగ్స్ హ‌త్తుకుంటాయి. కోట‌గిరి ఎడిటింగ్ షార్ప్‌గా లేదు. సినిమా స్లోగా సాగుతున్న భావ‌న వ‌స్తుంది. అయితే గోపిసుంద‌ర్ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌, జ్ఞాన‌శేఖ‌ర్ ఫోటోగ్ర‌ఫీ సినిమాకి ప్ల‌స్ అయ్యాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్‌
- క‌థ‌నం
- శ‌ర్వానంద్‌, నిత్యామీన‌న్‌ల న‌ట‌న‌
-  గోపిసుంద‌ర్ సంగీతం
- జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్‌
- ఎడిటింగ్‌
- చెప్పాల‌నుకున్న విష‌యం కొత్త‌దేమీ కాక‌పోవ‌డం
- ఫ‌స్టాఫ్‌లో సెంటిమెంట్ డోస్ పెరిగింది. అక్క‌డ‌క్క‌డా సీన్స్ క్లాస్‌ పీకిన‌ట్లు ఉండ‌టం

విశ్లేష‌ణ‌
ఒక ఫీల్ గుడ్ ల్ స్టోరికి మంచి టెక్నిక‌ల్ టీమ్ కుదిరితే పొయెటిక్ ల‌వ్‌స్టోరి అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సినిమా విష‌యంలో అదే జ‌రిగింది. ప్రేమ గురించి క్రాంతి మాధ‌వ్ చెప్పాల‌నుకున్న విష‌యాన్ని చ‌క్క‌గానే ప్రెజంట్ చేశాడు. అయితే సినిమా లెంగ్త్ మ‌రింత త‌గ్గించి ఉంటే బావుండేదెమో. గోపిసుంద‌ర్ క్లాస్ మ్యూజిక్‌తో పాటు చ‌క్క‌ని బ్యాగ్రౌండ్ స్కోర్‌, జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం,  సాయిమాధ‌వ్ డైలాగ్స్‌ సినిమాకి అద‌న‌పు బ‌లానిచ్చాయి. అయితే స్లో నెరేష‌న్ అవుతుంద‌నే విష‌యాన్ని డైరెక్ట‌ర్ మ‌ర‌చిపోయాడేమో.ల‌వ్ స్టోరి కాబ‌ట్టి యూత్ స‌హా అంద‌రూ ఎంజాయ్ చేయ‌వ‌చ్చు..
బాటమ్ లైన్‌:  పొయెటిక్ ల‌వ్ స్టోరి...మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు..

రేటింగ్‌: 3/5

ఎన్టీఆర్ కి 29 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అంట ?















'బలుపు' వంటి సూపర్ హిట్ సినిమాను పీవీపీ బ్యానర్ లో నిర్మించిన ప్రసాద్ వి పొట్లూరి. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు నిర్మించాడు. కమల్ హాసన్, విక్రమ్, ఆర్య, సంతానం హీరోలుగా పొట్లూరి నిర్మించిన మూవీల్లో కొన్ని తెలుగులోనూ డబ్ అయ్యాయి. టాలీవుడ్ లో బడా ఫైనాన్షియర్ గా చిత్రసీమలోకి ఎంటరై, నిర్మాతగా మారిన పొట్లూరి ప్రసాద్, తన అప్ మూవీలకి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమా ఘన విజయం సాధించగానే ప్రసాద్ ఆయనతో ఓ సినిమా తీయబోతున్నారనే వార్త హల్ చల్ చేసింది. అంతేకాదు... 'జనసేన' పార్టీ ఆవిర్భావ సభ, పొట్లూరి ప్రసాద్ నేతృత్వంలోనే జరిగిందని, దానికి ప్రతి ఫలంగా పవన్ ఓ సినిమా చేయడంతో పాటు... పార్లమెంట్ కూ ప్రసాద్ ను పంపడానికి సాయం చేస్తానని మాట ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
కానీ కారణాలు ఏవైనా... ఆ రెండు పనులు జరగలేదు. అలానే గత యేడాది తమిళ చిత్రం 'సూదుకవ్వం' రీమేక్ రైట్స్ కొని ఆ తర్వాత వాటిని రాజశేఖర్ కు ఇచ్చేశారు ప్రసాద్. అదే ఇప్పుడు 'గడ్డం గ్యాంగ్'గా రాబోతోంది. ఇక నాగార్జున, ఎన్టీఆర్ కాంబినేషన్ లోనూ ప్రసాద్ ఓ సినిమాను ప్లాన్ చేశారు. అయితే చివరకు ఆ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ ప్లేస్ లోకి తమిళ హీరో కార్తీ వచ్చి చేరాడు.
     
ఈ విషయమై అధికారిక ప్రకటన ఇచ్చినా... ఈ సినిమా మాత్రం ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్ళలేదు. లేటెస్ట్ గా ఇదే సంస్థ ఎన్టీఆర్ తో ఓ మూవీ చేయబోతోందని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎన్టీఆర్ కి రెమ్యునరేషన్ గా, పి.వి.పి సంస్థ 29 కోట్ల రూపాయలు ఫిక్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.