Sunday 1 March 2015

Bhale Bhale Magadivoy Muhurtham Images - Nani, Lavanya Tripathi






మంచు మనోజ్ చేసుకోబోతున్న ప్రణతి ఈవిడేనండీ



ఇప్పుడు టెన్షన్‌ ఎందుకు? - కాజల్‌

‘సినిమాల్లో నటిస్తున్నప్పుడు పబ్లిసిటీని ఎంతగా ఆస్వాదిస్తామో, గాసి్‌ప్సను కూడా అలాగే రిజీవ్‌ చేసుకోవాలి’’ అని అంటోంది కాజల్‌. ఎన్టీఆర్‌ సరసన ఈ భామ నటించిన ‘టెంపర్‌’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా హిట్‌ కావడం పట్ల ఆనందంగా ఉందీ సుందరి. ఆమె మాట్లాడుతూ ‘‘ఉన్నదానికీ, లేనిదానికీ టెన్షన్‌ పడితే కొత్తగా వచ్చేదేమీ ఉండదు. అనవసరంగా ఒత్తిడి గురికావడం నాకిష్టం ఉండదు. అందుకే ఎప్పుడైనా ప్రతికూల విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు ‘సైలెన్స్‌ ఈజ్‌ గోల్డ్‌’ అనే మాటలను గుర్తుచేసుకుంటాను. వాదనలకు దిగకుండా మౌనాన్ని ఆశ్రయిస్తాను. అంతేగానీ పదేపదే జరిగినదాన్నే తలచుకుంటూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. వయసు, అనుభవం పెరిగే కొద్దీ ఈ పరిపక్వత అందరికీ వస్తుందని నా భావన’’ అని వివరించింది కాజల్‌. అన్నట్టు కాజల్‌కి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదట. తనకు మంచి వ్యక్తి తారసపడితే ప్రేమిస్తుందట. ఒకవేళ ఎవరూ నచ్చకపోతే వరుడిని వెతికే బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగిస్తాను అని వివరించిందీ ముద్దు గుమ్మ.

సునీల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

సునీల్‌ కథానాయకుడిగా ఆర్‌పిఏ క్రియేషన్స్‌ పతాకంపై ఆర్‌.సుదర్శన్‌ రెడ్డి ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తారు. శనివారం సునీల్‌ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమా ‘ప్రేమకథా చిత్రమ్‌’ చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల అంచనాలు అందుకునే కథ కోసం ఇంతకాలం ఎదురుచూశాం. వంశీకృష్ణ చక్కని కథతో నా దగ్గరికొచ్చారు. కథ విన్న వెంటనే నేనూ, సునీల్‌ అంగీకరించాం. సునీల్‌కి యాప్ట్‌ అయిన కథ ఇది. ఆయన నుండి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఇందులో సునీల్‌ బాడీ లాంగ్వేజ్‌ కొత్తగా ఉంటుంది. పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కునున్న ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో వెల్లడిస్తాం’’ అని అన్నారు. ‘రక్ష’ తర్వాత కమర్షియల్‌ సక్సెస్‌ కోసం చూస్తున్న తనకు అన్ని హంగులు ఉన్న కథ కుదిరిందనీ, సునీల్‌ కథ వినగానే ‘ఇటువంటి కథ కోసమే ఎదురుచూస్తున్నాను’ అని అనడం చాలా ఆనందంగా ఉందనీ దర్శకుడు వంశీకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఆర్‌.ఆయు్‌షరెడ్డి, ఆర్‌.పి.అక్షిత్‌ రెడ్డి.

అఖిల్‌ సినిమాలో విలన్‌గా మహేష్‌.

అక్కినేని నట వారసుడు అఖిల్‌ డెబ్యూ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తయిన సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఫైట్‌ సీన్లు చిత్రీకరించారు. ఫైట్‌ మాస్టర్‌ రవివర్మ నేతృత్వంలో అఖిల్‌ తన తొలి షెడ్యూల్‌ పూర్తి చేశాడు. అయితే సినిమా మొదలు పెట్టినప్పటీ నుంచి నటీనటుల ఎంపిక వరకూ చాలా జాగ్రత్త వహిస్తున్నారు దర్శకుడు వినాయక్‌. తాజాగా ఈ సినిమాలో విలన్‌గా మహేష్‌ మంజ్రేకర్‌ నటిస్తున్నట్లు సమాచారం. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ‘అదుర్స్‌’లో విలన్‌గా నటించిన మహేష్‌ మంజ్రేకర్‌ తెలుగు ప్రేక్షకులు సుపరిచితులు కావడం విశేషం. అఖిల్‌ తొలి చిత్రంలో విలన్‌గా మహేష్‌ అయితే సరిగ్గా సరిపోతారని వినాయక్‌ భావించారట. ప్రస్తుతం హీరోయిన్‌ సాయేషా సైగల్‌  చిత్రీకరణలో పాల్గొందని తెలిసింది.