Showing posts with label Reviews. Show all posts
Showing posts with label Reviews. Show all posts

Friday, 22 May 2015

Mosagallaku Mosagadu Movie Review

ఒకప్పుడు కృష్ణను ఇండియన్‌ కౌబాయ్‌గా చూపించి మెప్పించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ వంటి ఘనమైన టైటిల్‌తో రావడం, అందులోనూ హీరో కృష్ణకు స్వయానా అల్లుడు కావడం, పైగా ఇది ‘స్వామి రారా’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన బేనర్‌ సినిమా కావడం వల్ల కలిగిన ఆసక్తి, సినిమా చూస్తున్నంత సేపూ నీరుకారి పోయింది. ప్రేక్షకుల అంచనాలను తృప్తిపరిచే ఆకర్షణలేవీ ఈ సినిమాలో లేవు. సుధీర్‌బాబు, జయప్రకాశ్‌రెడ్డి, చంద్రమోహన్‌ వంటివాళ్లు బాగా నటించి ఉండవచ్చు. కానీ మంచి నటన రాణించేందుకు తగిన పాత్రలు కానీ, సన్నివేశాలు కానీ, కథ కానీ ఇందులో లేవు.
 
‘స్వామి రారా’ సాధించిన విజయంతో క్రైమ్‌ కామెడీ తీస్తే హిట్టే అనే నమ్మకం తెలుగు సినిమా ఇండసీ్ట్రలో బలపడినట్లు అనిపిస్తుంది. కానీ అది కేవలం నమ్మకమే కానీ, వాస్తవం కాదని నిన్నటికి నిన్న ఇదే ధోరణిలో వచ్చిన ‘దోచేయ్‌’ రుజువు చేస్తే, తాజాగా ఆ బాధ్యతను ‘మోసగాళ్లకు మోసగాడు’ తీసుకున్నాడు. బలమైన సన్నివేశాల కల్పన, బిగువైన స్ర్కీన్‌ప్లే, ఆహ్లాదపరిచే కామెడీ వల్లే క్రైమ్‌ కామెడీలు ప్రేక్షకుల్ని రంజింపజేస్తాయి. ‘మోసగాళ్లకు మోసగాడు’లో కొన్ని ఆహ్లాదపరిచే కామెడీ సన్నివేశాలున్నాయి కానీ కథాగమనంలో అవి తేలిపోయాయి. మనసుని స్పందింపజేసే ఒక్క బలమైన సన్నివేశమూ లేకపోవడం, స్ర్కీన్‌ప్లే గజిబిజిగా నడవడం వల్ల ఈ సినిమా ఆద్యంతమూ విసుగునీ, చికాకునీ కలిగిస్తుంది. ఫస్టాఫ్‌ బోరింగ్‌గా ఉందనుకుంటే, సెకండాఫ్‌ దానికి జేజమ్మలా తలబొప్పి కట్టిస్తుంది.
 
‘మోసగాళ్లకు మోసగాడు’ ఓ అవాస్తవిక కథ చుట్టూ నడిచే సినిమా. ‘స్వామి రారా’ కథ వినాయక విగ్రహం చుట్టూ నడిస్తే, ఈ సినిమా కథ అయోధ్యకు 12 కి.మీ. దూరంలోని గుడి నుంచి దొంగతనానికి గురైన సీతారాముల విగ్రహాల చుట్టూ నడుస్తుంది. క్రిష్‌ (సుధీర్‌బాబు) అనే ఓ చిల్లర దొంగ, లింగంపల్లిలోని ప్రభుత్వ గ్రంథాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేసే జానకి (నందిని) అనే అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. ఆమె వెంటపడతాడు. పెళ్లి కోసం మేరేజి బ్యూరోని సంప్రదించిన జానకి, మొదట క్రిష్‌ అంటే ఇష్టపడదు. కానీ ఓ ‘పాట’తో అతడి ప్రేమను ఒప్పేసుకుంటుంది. అతడు దొంగనీ, మోసగాళ్లకు మోసగాడనీ తెలిశాక, ఆ పాడుపనిని వదిలేయమంటుంది కానీ అతణ్ణి మాత్రం వదిలేయలేకపోతుంది, గొప్ప ప్రేమికురాలికి మల్లే. అయోధ్య నుంచి ఎంతో నాటకీయంగా, ‘ఔరా! విగ్రహాలను దొంగలించుట ఇంత సునాయాసమా!’ అనేట్లు.. పళ్లెంలోని సీతారాముల విగ్రహాల్ని పూజారి నీళ్లలో ముంచి తీసేలోపలే, ఆ విగ్రహాల్ని మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ విగ్రహాలు ఉంచి ఉడాయించిన ఇద్దరు దొంగలు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చెరో విగ్రహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుంటారు. ఒక దొంగ తప్పించుకుని దుబాయ్‌లోని తమ యజమాని రుద్ర (అభిమన్యు సింగ్‌) వద్దకు వెళ్తే, ఇంకో దొంగ పోలీసులకు దొరికిపోయి చచ్చిపోతాడు. కానీ ఈలోగా అతడి దగ్గరున్న రామ విగ్రహాన్ని క్రిష్‌ చేజిక్కించుకుంటాడు. విగ్రహాల విలువను అంచనాకట్టే అతని వద్దకు తీసుకుపోతే, అది అమూల్యమైన నవరత్న లోహాలతో చేసినదనీ, అయితే సీత విగ్రహం తోడుగా ఉంటేనే దానికి విలువనీ, లేకపోతే దానికి విలువలేదనీ చెబుతాడు. దాంతో మైండ్‌ గేమ్‌ మొదలుపెడతాడు క్రిష్‌. అదివరకే ఆ విగ్రహాలను స్మగ్లింగ్‌ చేయడానికి రూ. 25 కోట్లకు డీల్‌ కుదుర్చుకున్న రుద్ర హైదరాబాద్‌ వస్తాడు, రామ విగ్రహం కోసం. ఆ విగ్రహాన్ని జానకి ద్వారా రుద్ర వద్దకు చేర్చి, తనూ అతడివద్దకు వెళతాడు క్రిష్‌. ఆ విగ్రహాల కోసం రుద్రతో డీల్‌ మాట్లాడుకున్న వాళ్లు కూడా రూ. 25 కోట్లతో హైదరాబాద్‌ వస్తారు. విగ్రహాలు పోలీసుల చేతికీ, డబ్బు తన చేతికీ వచ్చేలా క్రిష్‌ ఏం చేశాడనేది క్లైమాక్స్‌.
 
 ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాల్లో మనం ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ ఆటలు చూశాం. ఇందులోనూ సేమ్‌థింగ్‌ రిపీట్‌. విలన్‌ దగ్గరే ఉంటూ, అతడికి అనుయాయిగా నటిస్తూ, ఆఖరుకి అతణ్ణి ‘ఉత్త వెధవాయి’గా హీరో తేల్చేసే సీన్లు ఎన్ని సినిమాల్లో మనం చూడలేదు! ఈ సినిమాలో సెకండాఫ్‌ అంతా ఈ తరహాలోనే నడిచి, ‘ప్చ్‌.. ఇది కూడా ఇదే బాపతా’ అనే చిరాకుని కలిగిస్తుంది. మోసాలతోటే రోజులు గడిపే క్రిష్‌ చివరకు తను మోసంతో కొట్టేసిన డబ్బును ‘శ్రీరామ విద్యాలయము’ పరాధీనం కాకుండా చేయ్యడానికి వెచ్చించడమనేది ఎంత అస్వాభావికంగా ఉందో! నీతినే నమ్ముకున్న మాస్టారు (చంద్రమోహన్‌) తనను ఎవరు ఎన్ని ప్రలోభాలకు లోను చెయ్యాలని చూసినా, విద్యాలయాన్ని అమ్ముకోడు. చివరకు అప్పులపాలై బ్యాంక్‌వాళ్లు స్కూలును వేలం వేస్తున్నా బేలగా బాధపడుతూ ఉండిపోతాడు. అటువంటివాణ్ణి కూడా తను మోసంతో సంపాదించిన సొమ్ముతో స్కూలు పరాధీనం కాకుండా చూసి, మోసం చేశాడు క్రిష్‌. ఎవరో ఓ యువకుడు (మంచు మనోజ్‌ - స్పెషల్‌ అప్పీరెన్స్‌) వచ్చి ‘మాస్టారూ నేను చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నవాణ్ణి. ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి’ అంటూ డబ్బున్న బ్యాగ్‌ ఇచ్చి వెళ్లిపోతే, అది క్రిష్‌ చేసిన ఏర్పాటని తెలీక నిజమే అని నమ్ముతాడు మాస్టారు. ఆ రకంగా మాస్టారు పాత్ర ఔన్నత్యాన్నీ, క్రిష్‌ పాత్ర ఔచిత్యాన్నీ దెబ్బతీశాడు దర్శకుడు. పైగా మాస్టారును అతడు ఎందుకు ఆదుకున్నాడో జానకికి క్రిష్‌ చెప్పిన కథ ప్రధాన కథకు అతకలేదు. అతను బాగా చిన్నవాడిగా ఉన్నప్పుడు మాస్టారు పర్సును దొంగిలిస్తాడు. కానీ అక్కడే యాక్సిడెంట్‌కు గురవుతాడు. మాస్టారే అతణ్ణి ఆస్పత్రిలో చేర్చి బతికిస్తాడు. కానీ తన పర్సు దొంగిలించింది క్రిష్‌ అని మాస్టారుకు తెలీదు. చిన్నప్పుడు అలా తనను కాపాడిన మాస్టారుకు ఇప్పుడు కృతజ్ఞత చూపించానని చెబుతాడు క్రిష్‌. ఇదెంత కృతకంగా ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. నిజానికి తను పర్సు దొంగిలించిన వ్యక్తే తనకు ప్రాణదానం చేస్తే, అప్పుడే క్రిష్‌లో పరివర్తన కలిగి, మంచివాడిగా పెరిగి ఉండాల్సింది. పేదవాళ్లకు ఉచితంగా చదువు చెబుతున్న మాస్టారి వద్దే చదువుకుని ఉండాల్సింది. కానీ అలా చేయకుండా దొంగగానే పెరిగి, మాస్టారు మందలిస్తుంటే, దులుపుకుని పోతుంటాడు. అంటే చివరలో క్రిష్‌ చెప్పిన కథ అసహజంగా ఉందన్న మాటే.
క్రిష్‌ పాత్రను సాధ్యమైనంత వరకు బాగా చెయ్యడానికి ప్రయత్నించాడు సుధీర్‌బాబు. హావభావాల పరంగా, డైలాగ్‌ డిక్షన్‌ పరంగా మునుపటి సినిమాలతో పోలిస్తే మెరుగయ్యాడు. ఈ సినిమాకు హీరోయిన్‌ పెద్ద మైనస్‌. అందచందాల పరంగా కానీ, హావభావాల పరంగా కానీ నందిని ఏమాత్రం ఆకట్టుకోలేదు. క్రిష్‌ని ఓ వైపు ప్రేమిస్తూనే, మరోవైపు అతణ్ణి పోలీసులకు పట్టించాలని ప్రయత్నించడంతో ఆ పాత్రకూ ఓ వ్యక్తిత్వం అనేది లేకుండా పోయింది. ఈ సినిమాలో పోలీసుల ప్రవర్తన మనకు మింగుడుపడదు. ఓ కేసును దర్యాప్తు చేస్తూ, చేతికి చిక్కిన నేరగాళ్లను అరెస్ట్‌ చేయకుండా, వాళ్లు ప్రతిఘటించకపోయినా, ‘టపా టపా’ కాల్చుకుంటూ పోతుంటారు. తమంతట తామే సాక్ష్యాలను చెరిపేస్తూ వెళ్తుంటారు. కౌశిక్‌గా, అతని బావమరిదిగా జయప్రకాశ్‌రెడ్డి, దువ్వాసి మోహన్‌ నవ్వించే ప్రయత్నంలో కొంతమేర సఫలమయ్యారు. కానీ జయప్రకాశ్‌ను మరీ బఫూన్‌ని చేయడంతో, అతను విలనా, కమెడియన్నా అనే విషయంలో దర్శకుడికే ఓ క్లారిటీ లేనట్లు కనిపించింది. రుద్రగా అభిమన్యుసింగ్‌ సోసోగా ఉన్నాడు. మాస్టారు పాత్రకు చంద్రమోహన్‌ అతికినట్లు సరిపోయాడు. సినిమాకి నేపథ్య సంగీతం కాస్త బలాన్నిచ్చేవిధంగా ఉన్నా, పాటలు మాత్రం పూర్తిగా తేలిపోయాయి. ఒక్క పాటనూ ప్రేక్షకులు కుర్చీలో కుదురుగా కూర్చొని ఆస్వాదించలేరు. ఛాయాగ్రహణం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా ఆరంభంలో ఇచ్చిన బిల్డప్‌కు తగ్గట్లు చివరిదాకా ఉంటే బాగుండేది. ఇన్ని లోపాలుండటం వల్ల సహజంగానే ‘మోసగాళ్లకు మోసగాడు’ బాగా విసుగుపుట్టించాడు. నిర్మాతలు ఇకనైనా ఒకే తరహా చిత్రాలను కాకుండా, కథాబలం ఉన్న భిన్న తరహా సినిమాలు తీస్తే బాగుంటుందని సగటు ప్రేక్షకుడు అభిప్రాయపడుతున్నాడు.
ట్యాగ్‌లైన్ : జనం మోసపోరు
 రేటింగ్‌: 1.75/5 

Thursday, 9 April 2015

Trivikram Dialogues From S/o Satyamurthy - s/o satyamurthy dialogues


"ఎంత ఏడిస్తే అంత ప్రేమ ఉన్నట్టు లెక్క అనుకుంటే మా నాన్న కోసం నేను ఏడిస్తే ఈ జీవితం సరిపోదు"
"తెలిసి చేస్తే మోసం-చేసాక తెలిస్తే తప్పు"
"అద్రుష్టం వచ్చి షేక్ హాండ్ ఇచ్చేలోపే దురద్రుష్టం వచ్చి లిప్ కిస్ పెట్టేసింది"
"కిడ్నాప్ చేసి పెంచుకోవడం అన్నారు ......చంపి భూమిలో పాతేసి దాచుకోవడం అంటారేమో
"యాక్సిడెంట్ అంటే బైకో కారో గుద్దుకుని రోడ్డు మీద పడడం కాదురా..ఒక ఫ్యామిలీ రోడ్డున పడ్డం"
"మనం బావున్నప్పుడు లెక్కలు మాట్లాడీ,కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడొద్దు సర్"
"కొన్ని సార్లు పట్టుకోవడం కంటే విడిచిపెట్టడమే ఉత్తమం..కొన్ని సార్లు గెలవడం కంటే ఓడిపోవడమే ఉత్తమం"
"తండ్రి చనిపోతే ఈవినింగ్ ఫ్లైట్ కి రేట్ తక్కువని సాయంత్రం వరకు వెయిట్ చేసి వచ్చాడు.అంత కమీనా"

Thursday, 5 March 2015

సూర్య వర్సెస్ సూర్య రివ్యూ

నటీనటులు : నిఖిల్ ,త్రిదా చౌదరి ,తనికెళ్ళ ,మధుబాల తదితరులు 
దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని 
నిర్మాత : శివకుమార్ 
సంగీతం :సత్య మహావీర్ 
విడుదల తేదీ : 5మార్చి 2015
రేటింగ్ : 2.5/5

వరుస సక్సెస్ లతో మంచి జోరుమీదున్నాడు యంగ్ హీరో నిఖిల్ . కార్తికేయ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేసిన కార్తీక్ ఘట్టమనేని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ''సూర్య వర్సెస్ సూర్య ''. విభిన్న కథా చిత్రాలను ఎన్నుకొని ముందుకు సాగుతున్న నిఖిల్ ఈ చిత్రంతో ఆ జోరు కొనసాగిస్తాడా లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే . 
కథ :సూర్యుణ్ణి చూడలేని వింత వ్యాధితో బాధపడే సూర్య(నిఖిల్ ) ఓ టివి చానల్ లో యాంకర్ అయిన సంజన (త్రిదా చౌదరి )ని చూసి ప్రేమలో పడతాడు . కానీ పగలు బయటికి రాలేని విచిత్ర పరిస్థితి సూర్య ది కావడంతో ........... ఒకానొక దశలో ఇక ఈ జీవితం ఇంతేనా అని కుమిలిపోతున్న సమయంలో తన ప్రియురాలి ద్వారా ఆ సమస్య నుండి ఎలా బయట పడ్డాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
నటీనటుల పెర్ఫార్మెన్స్ :సూర్య కాంతి చూడలేని పర్ఫీనియా అనే వింత వ్యాధితో బాధపడే సూర్య గా నిఖిల్ నటన చాలా బాగుంది. సినిమాలు చేయడమే కాదు నటనకు అవకాశం ఉన్న పాత్రలు కరువౌతున్న ఈరోజుల్లో నిఖిల్ అదృష్టం కొద్దీ చాలామంచి పాత్ర లభించింది . పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లభించడంతో తన సత్తా చూపించాడు నిఖిల్ . యంగ్ హీరోల్లో నిఖిల్ అదృష్టవంతుడు అనే చెప్పాలి ,మంచి స్క్రిప్ట్ లను ఎన్నుకుంటు తనదైన ముద్ర వేస్తూ ముందడుగు వేస్తున్నాడు . సూర్య పాత్రకు స్టైలిష్ లుక్ ఇచ్చి బెటర్ అవుట్ పుట్ ఇచ్చాడు . ఇక హీరో తల్లిగా మధుబాల నటించింది . హీరోయిన్ గా నటించిన త్రిదా చౌదరి ఫరవాలేదు . తనికెళ్ళ ,సత్య ఇలా మిగతా పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు . 
సాంకేతిక వర్గం :కెమెరామెన్ అయిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం అవుతూ డిఫరెంట్ కాన్సెప్ట్ ని అటెంప్ట్ చేయడం చాలాబాగుంది . కానీ మొదటి భాగాన్ని సవ్యంగా ,అందంగా చక్కని ఫీల్ ఉన్న లవ్ స్టొరీ లా తీసుకెళ్ళిన కార్తిక్ రెండవ భాగాన్ని మాత్రం సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు . ఐతే మొదటగా ఈ కాన్సెప్ట్ ని ఎన్నుకున్న కార్తీక్ ని తప్పకుండా అభినందించాల్సిందే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి . కథ ,డైలాగ్స్  బాగున్నప్పటికీ కథనాన్ని మరింత పకడ్బందీగా రాసుకుంటే తప్పకుండా నిఖిల్ చేతిలో ఓ బంపర్ హిట్ పడేది. మీడియం బడ్జెట్ అయినప్పటికీ కొన్ని విజువల్స్ అద్భుతంగా వచ్చాయంటే ఖచ్చితంగా దర్శకులు ,కెమెరామెన్ అయిన కార్తీక్ పనితనమే అని చెప్పాలి . సత్య మహావీర్ అందించిన సంగీతం బాగుంది ,పాటల కంటే నేపథ్య సంగీతం ఇంకా బాగుంది . 
విశ్లేషణ :వరుస విజయాలు సాధించిన నిఖిల్ నుండి వస్తున్న చిత్రం కావడం ,ప్రోమో లు కూడా బాగుండటంతో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి . అలాగే సినిమా మొదటిభాగం చక్కని ఫీల్ గుడ్ లవ్ స్టొరీ కావడం ,దానికి తోడూ హాస్య సన్నివేశాలతో హృద్యంగా సాగింది . ఐతే సెకండాఫ్ మాత్రం కాస్త స్లోగా ,మరిన్ని బోర్ ఫీలయ్యే సన్నివేశాలతో సినిమా వేగం తగ్గుతుంది . దానివల్ల ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీ  చూస్తున్నామన్న ఫీల్ ని చంపేసేలా చేసింది . సెకండాఫ్ ని కొంత ట్రిమ్ చేస్తే బాగుండేది . ఓవరాల్ గా నిఖిల్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో సూర్య వర్సెస్ సూర్య మల్టీప్లెక్స్ లలో ఆదరణ పొందవచ్చు కానీ బిసి కేంద్రాల్లో  మాత్రం నిరాశ పరచడం ఖాయం

Friday, 6 February 2015

'Malli Malli Idi Raani Roju' Review 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' మూవీ రివ్యూ




ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్ లో వ‌చ్చిన ల‌వ్ స్టోరి మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు. ఓన‌మాలు చిత్రంతో ఆశించిన స్థాయి విజ‌యాన్ని అందుకోలేక పోయిన ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. శ‌ర్వానంద్‌, నిత్యామీన‌న్ తొలిసారి జంట‌గా న‌టించిన చిత్రం. ర‌న్ రాజా ర‌న్ చిత్రం త‌ర్వాత శ‌ర్వానంద్ ఈ చిత్రం పై చాలా ఆశ‌ల‌నే పెట్టుకున్నాడ‌నాలి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది, ప్రేక్ష‌కుల ప్రేమ‌ను గెలుచుకుందా అని తెలుసుకోవాలంట క‌థ తెలుసుకోవాల్సిందే...

క‌థ‌
రాజారాం(శ‌ర్వానంద్ నేష‌న‌ల్ లెవ‌ల్‌లో రన్నింగ్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించాల‌నే కోరిక ఉన్న పేదింటి యువ‌కుడు. త‌ల్లి పార్వ‌త‌మ్మ‌తో క‌లిసి జీవిస్తుంటాడు. స్టేట్ లెవ‌ల్ పోటీలు జ‌రిగే సంద‌ర్భంలో నజీర(నిత్యామీన‌న్‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. న‌జీర కూడా రాజారాంను ఇష్ట‌ప‌డుతుంది. త‌న‌కి ముఖం చూపించ‌కుండా ఆట‌ప‌ట్టిస్తుంటుంది. రాజారాం త‌ల్లి ద‌గ్గ‌ర ఖానం అనే పేరుతో సంగీతం నేర్చుకుంటుంది. అయితే ఓ సంద‌ర్భంలో న‌జీర‌, ఖానం ఒక‌రేన‌ని నిజం రాజారాంకి తెలిసిపోతుంది. అయితే అనుకోని ప‌రిస్థితుల్లో వారిద్ద‌రూ విడిపోతారు. న‌జీర తానెక్క‌డున్న విష‌యాన్ని రాజారాంకి చెప్ప‌దు. అస‌లు రాజారాం, నజీర ఎందుకు విడిపోతారు? న‌జీర త‌న వివ‌రాల‌ను రాజారాం ఎందుకు తెలియ‌జేయ‌దు? అస‌లు ఇద్ద‌రూ క‌లుసుకుంటారా?  అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
 
న‌టీన‌టు ప‌నితీరు
శ‌ర్వానంద్‌, ర‌న్ రాజా ర‌న్ వంటి క‌మ‌ర్షియ‌ల్ హిట్ త‌ర్వాత కూడా డిఫ‌రెంట్‌గా ట్రై చేసిన ల‌వ్ స్టోరి. ఇందులో కాలేజీ యువ‌కుడిగా, మ‌ధ్య వ‌య‌స్కుడిగా రెండు షేడ్స్‌లో చ‌క్క‌గా న‌టించాడు. డైలాగ్స్ బాగా చెప్ప‌డమే కాకుండా మంచి ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చాడు. నిత్యామీన‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌ళ్ల‌తోనే భావాల‌ను ప‌లికిస్తూ ప్రేక్ష‌కుల మ‌దిని దోచేసింది. రియ‌ల్ ల‌వ‌ర్స్‌లాగా మంచి కెమిస్ట్రీ పండించారు. నిత్యామీన‌న్ కూడా రెండు షేడ్స్‌ను అద్భుతంగా చేసింది. పున‌ర్న‌వి, తేజ‌స్విని త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. నాజ‌ర్‌, సూర్య‌, చిన్నా ఇత‌ర న‌టీన‌టులు త‌మ ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు.
సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు
నిజ‌మైన ప్రేమ బ్రేక్ అప్‌ను కోరుకోదు. అలాగే త‌ప్ప‌కుండా గెలిచి తీరుతుందనే విష‌యం పాతదే అయిన‌ప్ప‌టికీ డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ ఆ పాయింట్‌ను చ‌క్క‌గా ప్రెజంట్ చేశాడు. అలాగే క‌థ‌కు త‌గిన న‌టీన‌టులను ఎంచుకోవ‌డంతో తొలి స్టెప్‌లోనే స‌క్సెస్ అయ్యాడు. అయితే సినిమా అంతా స్లోగా సాగుతుంది. ఎంతలా అంటే మూడు విష‌యాల‌ను చెప్పేలోప‌లే ఇంట‌ర్వెల్ వ‌చ్చేస్తుంది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌లో సెంటిమెంట్ ఆర్టిఫిషియ‌ల్‌గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్‌. చాలా చ‌క్క‌ని డైలాగ్స్ రాశాడు. ఫ‌స్టాఫ్‌లో డోస్ ఎక్కువ‌ని అనిపించినా సెకండాఫ్‌లో ఆ డోస్ స‌రిపోయింది. నాకెప్పుడూ దూరంగా ఉండేది ద‌గ్గ‌రైపోతుంది. ద‌గ్గ‌ర‌గా ఉండేది దూర‌మై పోతుంది..ఎందుకంటే నేను ర‌న్న‌ర్‌ని, బ్రేక్ అప్ చెప్పాల‌నుకున్న‌ప్పుడు చెప్పెయ్ ఎందుకంటే నిజమైన ల‌వ్‌కి బ్రేక్ అప్ ఉండ‌దు. గెలిచేవాడెప్పుడు ల‌క్ష్యంవైపు వెళుతుంటే.. ఓడిపోయేవాడు ఇత‌రుల‌ను ఎలా ఓడించాలా అని ఆలోచిస్తాడు.. వంటి చాలా డైలాగ్స్ హ‌త్తుకుంటాయి. కోట‌గిరి ఎడిటింగ్ షార్ప్‌గా లేదు. సినిమా స్లోగా సాగుతున్న భావ‌న వ‌స్తుంది. అయితే గోపిసుంద‌ర్ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌, జ్ఞాన‌శేఖ‌ర్ ఫోటోగ్ర‌ఫీ సినిమాకి ప్ల‌స్ అయ్యాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్‌
- క‌థ‌నం
- శ‌ర్వానంద్‌, నిత్యామీన‌న్‌ల న‌ట‌న‌
-  గోపిసుంద‌ర్ సంగీతం
- జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్‌
- ఎడిటింగ్‌
- చెప్పాల‌నుకున్న విష‌యం కొత్త‌దేమీ కాక‌పోవ‌డం
- ఫ‌స్టాఫ్‌లో సెంటిమెంట్ డోస్ పెరిగింది. అక్క‌డ‌క్క‌డా సీన్స్ క్లాస్‌ పీకిన‌ట్లు ఉండ‌టం

విశ్లేష‌ణ‌
ఒక ఫీల్ గుడ్ ల్ స్టోరికి మంచి టెక్నిక‌ల్ టీమ్ కుదిరితే పొయెటిక్ ల‌వ్‌స్టోరి అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సినిమా విష‌యంలో అదే జ‌రిగింది. ప్రేమ గురించి క్రాంతి మాధ‌వ్ చెప్పాల‌నుకున్న విష‌యాన్ని చ‌క్క‌గానే ప్రెజంట్ చేశాడు. అయితే సినిమా లెంగ్త్ మ‌రింత త‌గ్గించి ఉంటే బావుండేదెమో. గోపిసుంద‌ర్ క్లాస్ మ్యూజిక్‌తో పాటు చ‌క్క‌ని బ్యాగ్రౌండ్ స్కోర్‌, జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం,  సాయిమాధ‌వ్ డైలాగ్స్‌ సినిమాకి అద‌న‌పు బ‌లానిచ్చాయి. అయితే స్లో నెరేష‌న్ అవుతుంద‌నే విష‌యాన్ని డైరెక్ట‌ర్ మ‌ర‌చిపోయాడేమో.ల‌వ్ స్టోరి కాబ‌ట్టి యూత్ స‌హా అంద‌రూ ఎంజాయ్ చేయ‌వ‌చ్చు..
బాటమ్ లైన్‌:  పొయెటిక్ ల‌వ్ స్టోరి...మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు..

రేటింగ్‌: 3/5

Friday, 9 January 2015

Gopala Gopala full review Mikosam

                                                                                                                                                                                                                                                                                                                                                    
గోపాల గోపాల – గోపాలుడిచ్చిన సంక్రాంతి ఎంటర్టై రేటింగ్ : 3.5/5
దర్శకత్వం : కిషోర్ కుమార్ పార్దసాని
నిర్మాత : డి.సురేష్ బాబు, శరత్ మారర్సంగీతం : అనూప్ రూబెన్స్నటీనటులు : వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రియ శరన్…అభిమానులు దేవుడుగా భావించే పవన్ కళ్యాణ్ గోపాలుడిగా, నిజజీవితంలో భక్తుడైన వెంకటేష్ నాస్తికుడైన గోపాల రావు పాత్రలో నటించిన క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు మూడు రోజుల ముందే బోగి, సంక్రాంతి పండుగలు ఈ సినిమా రిలీజ్ తో మొదలైంది. భారీ అంచనాల నడువ ఈ రోజు విడుదలైన ఈ సినిమాకి కిషోర్ కుమార్ పార్ధసాని డైరెక్టర్. సినిమా మొదలైన నాటి నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న సినీ ప్రేమికులు, అభిమానుల అంచనాలను ‘గోపాల గోపాల’ ఎంతవరకూ అందుకుంది. అసలు గోపాలుడుగా పవన్ కళ్యాణ్ చేసిన లీల ఏంటనేది మీకోసం..కథ :ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి గోపాల్ రావు(వెంకటేష్). స్వతహాగా గోపాల్ రావు నాస్థికుడు. కానీ తను చేసేది మాత్రం దేవుడి బొమ్మలను, విగ్రహాలను అమ్మడం. ఆ విగ్రహాలను అమ్మడంలో మాత్రం దేవుళ్ళ పేర్లను, ప్రజల మూడ నమ్మకాలను బాగా వాడుకుంటూ ఉంటాడు. అప్పుడే గోపాల్ రావు ఉండే ఏరియాలో సంభవించిన భూకంపం వల్ల గోపాల్ రావు షాప్ మొత్తం కూలిపోతుంది. దాంతో తన షాప్ పేరు మీద చేసిన ఇన్స్యూరెన్స్ ని ఇమ్మని గోపాల్ రావు కోరతాడు. కానీ ఆ నష్టం గాడ్ అఫ్ యాక్ట్ అనే దాని వల్ల జరిగిందని, అలా జరిగితే ఇన్సూరెన్స్ ఇవ్వరని చెప్పడంతో గోపాల్ రావు తనకు నష్టం చేసిన దేవుడిపై కేసు వేస్తాడు.ఆ కేసులోకి మేము దైవాంస సంభూతులం అని చెప్పుకుంటూ స్వామీజీలుగా పేరు తెచ్చుకున్న లీలాధర (మిథున్ చక్రవర్తి), గోపిక మాత(దీక్ష పంత్), సిద్దేశ్వర మహారాజ్(పోసాని కృష్ణ మురళి)లను ఇన్వాల్వ్ చేస్తాడు. గోపాల్ రావు చేసిన పనికి అతన్ని చంపడానికి ఈ స్వామీజీలు ట్రై చేస్తున్న టైంలో గోవింద గోపాల హరి అలియాస్ శ్రీ కృష్ణుడు(పవన్ కళ్యాణ్) ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయిన గోపాల గోపాల్ రావుకి ఎలా సాయం చేసాడు.? అసలు నాస్తికుడైన గోపాల్ రావు దగ్గరకి కృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చాడు.? దేవుని మీద వేసిన కేసులో గోపాల్ రావు గెలిచాడా.? లేదా.? గోపాల్ రావుని అడ్డుకోవడం కోసం లీలాధర, గోపిక మాత, సిద్దేశ్వర మహారాజ్ లు ఏమేమి చేసారు.? ఈ గోపాల్ రావు – గోపాలుడి కాంబినేషన్ ఎలా ఉందనేది.? మీరు వెండితెరపైనే చూడాలి..ప్లస్ పాయింట్స్ :నేనే కాదు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది, సినిమాకి ప్రాణం పోసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ఇక సినిమా విషయానికి వస్తే సినిమాకి హైలైట్ గా నిలిచేది పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ అక్కడ వారిమధ్య వచ్చే సీన్స్, ఆ తరువాత సెకండాఫ్ లో వారిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ ఆడియన్స్ నవ్విస్తూనే, వాళ్ళని ఎంతో ఆలోచించేలా చేస్తాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకులకు, ముఖ్యంగా అభిమానులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. మోడ్రన్ శ్రీ కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం, డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, ఆ పాత్రకి రాసిన డైలాగ్స్ అన్నీ హైలైట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ లుక్ అండ్ పెర్ఫార్మన్స్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఒక దేవుడి పాత్రలో పవన్ వేసే కొన్ని పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఇక నాస్తికుడిగా వెంకటేష్ నటన బాగుంది. ఆయన పాత్ర సినిమాలో ఎక్కువ సేపు ఉంటుంది. ముఖ్యంగా కోర్టు సీన్స్ లో వెంకటేష్ వేసిన సెటైర్స్, పవన్ కళ్యాణ్ తో వెంకీ వేసే పంచ్ లు చూసే ఆడియన్స్ లో ఒక కొత్త ఫీలింగ్ ని కలిగిస్తాయి. ముఖ్యంగా వెంకటేష్ పవన్ ని తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ వచ్చే సీన్స్ బాగున్నాయి. శ్రియ శరన్ కి సినిమాలో ఉన్నది చిన్న పాత్ర. ఉన్నంతలో ఓకే అనిపించింది.ఇక చెప్పుకోవాల్సింది బాబాజీగా చేసిన పోసాని కృష్ణ మురళి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసాడు. వెంకటేష్ – పోసాని కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా నవ్వు తెప్పిస్తాయి. బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి లీలాధర స్వామీజీ పాత్రలో జీవించాడు. ఆయనకి డైలాగ్స్ తక్కువ ఉన్నా అతని పాత్ర మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. కృష్ణుడు, దీక్ష పంత్, రంగనాథ్, ఆశిష్ విద్యార్థి, మురళీ శర్మ, మధు శాలిని వీళ్ళందరూ తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక ఈ సినిమా టాప్ హైలైట్స్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్, పవన్ – వెంకీ కాంబినేషన్ లో వచ్చే ఘటోత్కచుని సీన్, కోర్ట్ సీన్, క్లైమాక్స్ ఎపిసోడ్. ఇక వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చే ‘భజే భాజే’ సాంగ్ చూసే ప్రేక్షకులకి కన్నుల పండుగగా ఉంటుంది. ఈ పాటలో పవన్ ని చూపించిన విధానం, పవన్ – వెంకీ కలిసి వేసే స్టెప్స్ అద్భుతః అని చెప్పాలి.క్లైమాక్స్ లో వచ్చే విశ్వరూపం సీన్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కథే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఈ సినిమా స్టొరీ లైన్ ఒక యూనివర్సల్ పాయింట్ కావున తెలుగు వారికి కూడా కనెక్ట్ అవుతుంది. ఈ కంటెంట్ కి సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ రాసుకున్న సీన్స్ ని మరో మెట్టు పైకి ఎక్కించాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. ప్లస్ పాయింట్స్ లో కొసమెరుపు ఏమిటంటే సినిమా అంతా అయిపోయాక ఎండ్ టైటిల్ స్టార్ అయ్యాక పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కలిసి భజే భాజే సాంగ్ లో డాన్స్ వేసిన 40 సెకన్ల బిట్ ‘న భూతో న భవిష్యత్’ అనేలా ఉంది.. సో డోంట్ మిస్ దట్ పార్ట్ ఫ్రెండ్స్..మైనస్ పాయింట్స్ :ఈ సినిమాకి మొదట చెప్పాల్సిన బిగ్గెస్ట్ మైనస్ పాయింట్.. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్నంత స్ట్రాంగ్ గా కంటెంట్ ని చెప్పలేకపోవడం. చెప్పాలంటే ఈ మూవీ పాయింట్ ఓ వివాదాస్పదమైనది. అయినప్పటికీ దాని మాతృక హిందీ వెర్షన్ లో చాలా బాగా చెప్పాడు కానీ మన తెలుగులో ఎక్కడ వివాదాస్పదం అవుతుందేమో అని కంటెంట్ ని కర్ర విరగ కూడదు పాము చావకూడదు అన్న స్టైల్లో పై పైనే చెప్పి వదిలేసారు. అందువల్ల సినిమాలో ఉన్న మెయిన్ కంటెంట్ ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వరు. దానివల్ల ఫస్ట్ హాఫ్ లోని కంటెంట్ కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకే మొదట్లో వెంకీ పాత్ర చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. అలాగే వచ్చే సీన్స్ కూడా కాస్త రొటీన్ గా అనిపిస్తాయి.ఇకపోతే పవన్ కళ్యాణ్ పాత్ర ఈ సినిమాలో పూర్తిగా ఉంటుందేమో అనుకోని వెళ్ళే వారు కాస్త నిరుత్సాహపడతారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చివరి వరకూ పవన్ ఎంట్రీ ఉండదు. అలాగే పవన్ కళ్యాణ్ నుంచి ఆశించే మాస్ ఎలిమెంట్స్ ఏమీ ఇందులో లేదు. సినిమా ఓవరాల్ గా యావరేజ్ స్పీడ్ లోనే వెళ్తుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే పరంగా అక్కడక్కడా కాస్త స్పీడ్ చేసి ఉంటే బాగుండేది. ఒరిజినల్ వెర్షన్ కంటే ఈ సినిమాలో 33 నిమిషాల లెంగ్త్ పెంచారు. చెప్పాలంటే కథకి అంత లెంగ్త్ అవసరం లేదు. అలాగే హిందీలో స్వామీజీల పాత్రలు కాస్త స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ ఇక్కడ అంత స్ట్రాంగ్ గా లేనందువల్ల గేమ్ అంటా వన్ వే లోనే వెళ్తుంటుంది. అందుకే పెద్ద కిక్ ఉండదు. క్లామాక్స్ లో వెంకటేష్ మీద పెట్టాలనుకున్న ఫైట్ సీక్వెన్స్ కూడా కథకి అనవసరం. ఇక పోతే ఈ సినిమా ఫుల్ క్లాస్ గా ఉండడం వలన యాక్షన్, రొటీన్ కామెడీ కోరుకునే వారికి పెద్దగా నచ్చదు.సాంకేతిక విభాగం :సాంకేతిక విభాగంలో ఎవరికీ వారే తమ టాలెంట్ ని నిరూపించుకోవడానికి తెగ పోటీ పడ్డారు. అందులో డిస్టింక్షన్ మార్క్స్ కొట్టేసింది ముగ్గురు.. వాళ్ళే అనూప్ రూబెన్స్, జయనన్ విన్సెంట్, సాయి మాధవ్ బుర్రా. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఎంత బాగున్నాయో ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ అంతకన్నా బాగుంది. ముఖ్యంగా పాత్రల స్వభావాలని బట్టి ఇచ్చిన డిఫరెంట్ మ్యూజిక్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఇకపోతే జయనన్ విన్సెంట్ స్టార్ హీరోలను చూపించిన విధానం ఫెంటాస్టిక్ అని చెప్పాలి. దేవుడుగా పవన్ ని చూపించిన విధానం అదిరిపోయింది. సింపుల్ గా చెప్పాలి అంటే చాలా రోజుల తర్వాత దేవుడంటే ఇలానే ఉంటాడేమో అనే ఫీలింగ్ ని తన విజువల్స్ తో ఆడియన్స్ కి కలిగించాడు. వారణాశిని చూపించిన విధానం, భజే భాజే పాటలో విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. సాయి మాధవ్ బుర్రా డైరెక్టర్ రాసుకున్న సీన్స్ కి తన అర్థవంతమైన డైలాగ్స్ తో ప్రాణం పోసాడు. అతని డైలాగ్స్ ఆ రేంజ్ లో లేకపోతే సినిమాలో కంటెంట్ మిస్ అయిపోయేది. ఎడిటర్ గౌతంరాజు ఓవరాల్ రన్ టైంలో ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది.ఇక ఈ సినిమా కథనం – దర్శకత్వ విభాగాలను డీల్ చేసింది కిషోర్ కుమార్ పార్ధసాని(డాలీ).. డాలీ కథనం విషయంలో లెంగ్త్ ని తగ్గించి ఇంకాస్త స్పీడ్ గా ఉండేలా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది. కానీ డైరెక్టర్ గా మట్టం మంచి మార్కులే కొట్టేసాడు. ఎందుకంటే పైన చెప్పినట్టు ఒరిజినల్ కంటెంట్ ని పక్కాగా చెప్పలేకపోయినా కాంబినేషన్ సీన్స్ ని మాత్రం చాలా బాగా డీల్ చేసాడు. అందుకే సినిమా అంతలా ఆడియన్స్ కి నచ్చుతుంది. బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు హై రేంజ్ లో ఉన్నాయి. ఆన్ స్క్రీన్ చూసే ప్రతి విజువల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది.తీర్పు :తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ – వెంకటేష్ ల ‘గోపాల గోపాల’ సినిమా 2015 తొలి తెలుగు హిట్ సినిమాగా నమోదైంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మల్టీ స్టారర్ మూవీ అభిమానులనే కాకుండా, కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మాయ మాటలు చెప్పే బాబాజీలను నమ్మకండి, దేవుడు ఎక్కడో లేడో మీలోనే ఉన్నాడు, మీ ధైర్యం, మీరు చేసే ధర్మమే దేవుడని చెప్పిన పాయింట్ అందరికీ బాగా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, వెంకటేష్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్, పవన్ – వెంకీల కాంబినేషన్ సీన్స్, విజువల్ వండర్ గా అనిపించే భాజీ భాజే సాంగ్ ఈ సినిమా చూస్తున్న వారి మదిలో అలా నిలిచిపోతాయి. సినిమా లెంగ్త్ ని తగ్గించి కంటెంట్ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘గోపాల గోపాల’ సినిమా ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన ఎమోషనల్ ఎంటర్టైనర్ విత్ గుడ్ కామెడీ అండ్ మెసేజ్. కొస మెరుపుగా ఇలాంటి ఓ మంచి కాన్సెప్ట్ ని తెలుగు ప్రేక్షకులకు అందివ్వడానికి ట్రై చేసి ట్రెండ్ సెట్ చేసిన ఈ చిత్ర టీంకి మా సెల్యూట్.. జై హింద్
Rating: 3.5/5-