నటీనటులు : నిఖిల్ ,త్రిదా చౌదరి ,తనికెళ్ళ ,మధుబాల తదితరులు
దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత : శివకుమార్
సంగీతం :సత్య మహావీర్
విడుదల తేదీ : 5మార్చి 2015
రేటింగ్ : 2.5/5
వరుస సక్సెస్ లతో మంచి జోరుమీదున్నాడు యంగ్ హీరో నిఖిల్ . కార్తికేయ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేసిన కార్తీక్ ఘట్టమనేని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ''సూర్య వర్సెస్ సూర్య ''. విభిన్న కథా చిత్రాలను ఎన్నుకొని ముందుకు సాగుతున్న నిఖిల్ ఈ చిత్రంతో ఆ జోరు కొనసాగిస్తాడా లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే .

కథ :సూర్యుణ్ణి చూడలేని వింత వ్యాధితో బాధపడే సూర్య(నిఖిల్ ) ఓ టివి చానల్ లో యాంకర్ అయిన సంజన (త్రిదా చౌదరి )ని చూసి ప్రేమలో పడతాడు . కానీ పగలు బయటికి రాలేని విచిత్ర పరిస్థితి సూర్య ది కావడంతో ........... ఒకానొక దశలో ఇక ఈ జీవితం ఇంతేనా అని కుమిలిపోతున్న సమయంలో తన ప్రియురాలి ద్వారా ఆ సమస్య నుండి ఎలా బయట పడ్డాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
నటీనటుల పెర్ఫార్మెన్స్ :సూర్య కాంతి చూడలేని పర్ఫీనియా అనే వింత వ్యాధితో బాధపడే సూర్య గా నిఖిల్ నటన చాలా బాగుంది. సినిమాలు చేయడమే కాదు నటనకు అవకాశం ఉన్న పాత్రలు కరువౌతున్న ఈరోజుల్లో నిఖిల్ అదృష్టం కొద్దీ చాలామంచి పాత్ర లభించింది . పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లభించడంతో తన సత్తా చూపించాడు నిఖిల్ . యంగ్ హీరోల్లో నిఖిల్ అదృష్టవంతుడు అనే చెప్పాలి ,మంచి స్క్రిప్ట్ లను ఎన్నుకుంటు తనదైన ముద్ర వేస్తూ ముందడుగు వేస్తున్నాడు . సూర్య పాత్రకు స్టైలిష్ లుక్ ఇచ్చి బెటర్ అవుట్ పుట్ ఇచ్చాడు . ఇక హీరో తల్లిగా మధుబాల నటించింది . హీరోయిన్ గా నటించిన త్రిదా చౌదరి ఫరవాలేదు . తనికెళ్ళ ,సత్య ఇలా మిగతా పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు .
సాంకేతిక వర్గం :కెమెరామెన్ అయిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం అవుతూ డిఫరెంట్ కాన్సెప్ట్ ని అటెంప్ట్ చేయడం చాలాబాగుంది . కానీ మొదటి భాగాన్ని సవ్యంగా ,అందంగా చక్కని ఫీల్ ఉన్న లవ్ స్టొరీ లా తీసుకెళ్ళిన కార్తిక్ రెండవ భాగాన్ని మాత్రం సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు . ఐతే మొదటగా ఈ కాన్సెప్ట్ ని ఎన్నుకున్న కార్తీక్ ని తప్పకుండా అభినందించాల్సిందే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి . కథ ,డైలాగ్స్ బాగున్నప్పటికీ కథనాన్ని మరింత పకడ్బందీగా రాసుకుంటే తప్పకుండా నిఖిల్ చేతిలో ఓ బంపర్ హిట్ పడేది. మీడియం బడ్జెట్ అయినప్పటికీ కొన్ని విజువల్స్ అద్భుతంగా వచ్చాయంటే ఖచ్చితంగా దర్శకులు ,కెమెరామెన్ అయిన కార్తీక్ పనితనమే అని చెప్పాలి . సత్య మహావీర్ అందించిన సంగీతం బాగుంది ,పాటల కంటే నేపథ్య సంగీతం ఇంకా బాగుంది .
విశ్లేషణ :వరుస విజయాలు సాధించిన నిఖిల్ నుండి వస్తున్న చిత్రం కావడం ,ప్రోమో లు కూడా బాగుండటంతో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి . అలాగే సినిమా మొదటిభాగం చక్కని ఫీల్ గుడ్ లవ్ స్టొరీ కావడం ,దానికి తోడూ హాస్య సన్నివేశాలతో హృద్యంగా సాగింది . ఐతే సెకండాఫ్ మాత్రం కాస్త స్లోగా ,మరిన్ని బోర్ ఫీలయ్యే సన్నివేశాలతో సినిమా వేగం తగ్గుతుంది . దానివల్ల ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీ చూస్తున్నామన్న ఫీల్ ని చంపేసేలా చేసింది . సెకండాఫ్ ని కొంత ట్రిమ్ చేస్తే బాగుండేది . ఓవరాల్ గా నిఖిల్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో సూర్య వర్సెస్ సూర్య మల్టీప్లెక్స్ లలో ఆదరణ పొందవచ్చు కానీ బిసి కేంద్రాల్లో మాత్రం నిరాశ పరచడం ఖాయం

No comments:
Post a Comment