Friday, 9 January 2015

Gopala Gopala full review Mikosam

                                                                                                                                                                                                                                                                                                                                                    
గోపాల గోపాల – గోపాలుడిచ్చిన సంక్రాంతి ఎంటర్టై రేటింగ్ : 3.5/5
దర్శకత్వం : కిషోర్ కుమార్ పార్దసాని
నిర్మాత : డి.సురేష్ బాబు, శరత్ మారర్సంగీతం : అనూప్ రూబెన్స్నటీనటులు : వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రియ శరన్…అభిమానులు దేవుడుగా భావించే పవన్ కళ్యాణ్ గోపాలుడిగా, నిజజీవితంలో భక్తుడైన వెంకటేష్ నాస్తికుడైన గోపాల రావు పాత్రలో నటించిన క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు మూడు రోజుల ముందే బోగి, సంక్రాంతి పండుగలు ఈ సినిమా రిలీజ్ తో మొదలైంది. భారీ అంచనాల నడువ ఈ రోజు విడుదలైన ఈ సినిమాకి కిషోర్ కుమార్ పార్ధసాని డైరెక్టర్. సినిమా మొదలైన నాటి నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న సినీ ప్రేమికులు, అభిమానుల అంచనాలను ‘గోపాల గోపాల’ ఎంతవరకూ అందుకుంది. అసలు గోపాలుడుగా పవన్ కళ్యాణ్ చేసిన లీల ఏంటనేది మీకోసం..కథ :ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి గోపాల్ రావు(వెంకటేష్). స్వతహాగా గోపాల్ రావు నాస్థికుడు. కానీ తను చేసేది మాత్రం దేవుడి బొమ్మలను, విగ్రహాలను అమ్మడం. ఆ విగ్రహాలను అమ్మడంలో మాత్రం దేవుళ్ళ పేర్లను, ప్రజల మూడ నమ్మకాలను బాగా వాడుకుంటూ ఉంటాడు. అప్పుడే గోపాల్ రావు ఉండే ఏరియాలో సంభవించిన భూకంపం వల్ల గోపాల్ రావు షాప్ మొత్తం కూలిపోతుంది. దాంతో తన షాప్ పేరు మీద చేసిన ఇన్స్యూరెన్స్ ని ఇమ్మని గోపాల్ రావు కోరతాడు. కానీ ఆ నష్టం గాడ్ అఫ్ యాక్ట్ అనే దాని వల్ల జరిగిందని, అలా జరిగితే ఇన్సూరెన్స్ ఇవ్వరని చెప్పడంతో గోపాల్ రావు తనకు నష్టం చేసిన దేవుడిపై కేసు వేస్తాడు.ఆ కేసులోకి మేము దైవాంస సంభూతులం అని చెప్పుకుంటూ స్వామీజీలుగా పేరు తెచ్చుకున్న లీలాధర (మిథున్ చక్రవర్తి), గోపిక మాత(దీక్ష పంత్), సిద్దేశ్వర మహారాజ్(పోసాని కృష్ణ మురళి)లను ఇన్వాల్వ్ చేస్తాడు. గోపాల్ రావు చేసిన పనికి అతన్ని చంపడానికి ఈ స్వామీజీలు ట్రై చేస్తున్న టైంలో గోవింద గోపాల హరి అలియాస్ శ్రీ కృష్ణుడు(పవన్ కళ్యాణ్) ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయిన గోపాల గోపాల్ రావుకి ఎలా సాయం చేసాడు.? అసలు నాస్తికుడైన గోపాల్ రావు దగ్గరకి కృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చాడు.? దేవుని మీద వేసిన కేసులో గోపాల్ రావు గెలిచాడా.? లేదా.? గోపాల్ రావుని అడ్డుకోవడం కోసం లీలాధర, గోపిక మాత, సిద్దేశ్వర మహారాజ్ లు ఏమేమి చేసారు.? ఈ గోపాల్ రావు – గోపాలుడి కాంబినేషన్ ఎలా ఉందనేది.? మీరు వెండితెరపైనే చూడాలి..ప్లస్ పాయింట్స్ :నేనే కాదు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది, సినిమాకి ప్రాణం పోసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ఇక సినిమా విషయానికి వస్తే సినిమాకి హైలైట్ గా నిలిచేది పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ అక్కడ వారిమధ్య వచ్చే సీన్స్, ఆ తరువాత సెకండాఫ్ లో వారిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ ఆడియన్స్ నవ్విస్తూనే, వాళ్ళని ఎంతో ఆలోచించేలా చేస్తాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకులకు, ముఖ్యంగా అభిమానులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. మోడ్రన్ శ్రీ కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం, డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, ఆ పాత్రకి రాసిన డైలాగ్స్ అన్నీ హైలైట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ లుక్ అండ్ పెర్ఫార్మన్స్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఒక దేవుడి పాత్రలో పవన్ వేసే కొన్ని పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఇక నాస్తికుడిగా వెంకటేష్ నటన బాగుంది. ఆయన పాత్ర సినిమాలో ఎక్కువ సేపు ఉంటుంది. ముఖ్యంగా కోర్టు సీన్స్ లో వెంకటేష్ వేసిన సెటైర్స్, పవన్ కళ్యాణ్ తో వెంకీ వేసే పంచ్ లు చూసే ఆడియన్స్ లో ఒక కొత్త ఫీలింగ్ ని కలిగిస్తాయి. ముఖ్యంగా వెంకటేష్ పవన్ ని తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ వచ్చే సీన్స్ బాగున్నాయి. శ్రియ శరన్ కి సినిమాలో ఉన్నది చిన్న పాత్ర. ఉన్నంతలో ఓకే అనిపించింది.ఇక చెప్పుకోవాల్సింది బాబాజీగా చేసిన పోసాని కృష్ణ మురళి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసాడు. వెంకటేష్ – పోసాని కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా నవ్వు తెప్పిస్తాయి. బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి లీలాధర స్వామీజీ పాత్రలో జీవించాడు. ఆయనకి డైలాగ్స్ తక్కువ ఉన్నా అతని పాత్ర మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. కృష్ణుడు, దీక్ష పంత్, రంగనాథ్, ఆశిష్ విద్యార్థి, మురళీ శర్మ, మధు శాలిని వీళ్ళందరూ తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక ఈ సినిమా టాప్ హైలైట్స్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్, పవన్ – వెంకీ కాంబినేషన్ లో వచ్చే ఘటోత్కచుని సీన్, కోర్ట్ సీన్, క్లైమాక్స్ ఎపిసోడ్. ఇక వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చే ‘భజే భాజే’ సాంగ్ చూసే ప్రేక్షకులకి కన్నుల పండుగగా ఉంటుంది. ఈ పాటలో పవన్ ని చూపించిన విధానం, పవన్ – వెంకీ కలిసి వేసే స్టెప్స్ అద్భుతః అని చెప్పాలి.క్లైమాక్స్ లో వచ్చే విశ్వరూపం సీన్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కథే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఈ సినిమా స్టొరీ లైన్ ఒక యూనివర్సల్ పాయింట్ కావున తెలుగు వారికి కూడా కనెక్ట్ అవుతుంది. ఈ కంటెంట్ కి సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ రాసుకున్న సీన్స్ ని మరో మెట్టు పైకి ఎక్కించాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. ప్లస్ పాయింట్స్ లో కొసమెరుపు ఏమిటంటే సినిమా అంతా అయిపోయాక ఎండ్ టైటిల్ స్టార్ అయ్యాక పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కలిసి భజే భాజే సాంగ్ లో డాన్స్ వేసిన 40 సెకన్ల బిట్ ‘న భూతో న భవిష్యత్’ అనేలా ఉంది.. సో డోంట్ మిస్ దట్ పార్ట్ ఫ్రెండ్స్..మైనస్ పాయింట్స్ :ఈ సినిమాకి మొదట చెప్పాల్సిన బిగ్గెస్ట్ మైనస్ పాయింట్.. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్నంత స్ట్రాంగ్ గా కంటెంట్ ని చెప్పలేకపోవడం. చెప్పాలంటే ఈ మూవీ పాయింట్ ఓ వివాదాస్పదమైనది. అయినప్పటికీ దాని మాతృక హిందీ వెర్షన్ లో చాలా బాగా చెప్పాడు కానీ మన తెలుగులో ఎక్కడ వివాదాస్పదం అవుతుందేమో అని కంటెంట్ ని కర్ర విరగ కూడదు పాము చావకూడదు అన్న స్టైల్లో పై పైనే చెప్పి వదిలేసారు. అందువల్ల సినిమాలో ఉన్న మెయిన్ కంటెంట్ ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వరు. దానివల్ల ఫస్ట్ హాఫ్ లోని కంటెంట్ కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకే మొదట్లో వెంకీ పాత్ర చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. అలాగే వచ్చే సీన్స్ కూడా కాస్త రొటీన్ గా అనిపిస్తాయి.ఇకపోతే పవన్ కళ్యాణ్ పాత్ర ఈ సినిమాలో పూర్తిగా ఉంటుందేమో అనుకోని వెళ్ళే వారు కాస్త నిరుత్సాహపడతారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చివరి వరకూ పవన్ ఎంట్రీ ఉండదు. అలాగే పవన్ కళ్యాణ్ నుంచి ఆశించే మాస్ ఎలిమెంట్స్ ఏమీ ఇందులో లేదు. సినిమా ఓవరాల్ గా యావరేజ్ స్పీడ్ లోనే వెళ్తుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే పరంగా అక్కడక్కడా కాస్త స్పీడ్ చేసి ఉంటే బాగుండేది. ఒరిజినల్ వెర్షన్ కంటే ఈ సినిమాలో 33 నిమిషాల లెంగ్త్ పెంచారు. చెప్పాలంటే కథకి అంత లెంగ్త్ అవసరం లేదు. అలాగే హిందీలో స్వామీజీల పాత్రలు కాస్త స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ ఇక్కడ అంత స్ట్రాంగ్ గా లేనందువల్ల గేమ్ అంటా వన్ వే లోనే వెళ్తుంటుంది. అందుకే పెద్ద కిక్ ఉండదు. క్లామాక్స్ లో వెంకటేష్ మీద పెట్టాలనుకున్న ఫైట్ సీక్వెన్స్ కూడా కథకి అనవసరం. ఇక పోతే ఈ సినిమా ఫుల్ క్లాస్ గా ఉండడం వలన యాక్షన్, రొటీన్ కామెడీ కోరుకునే వారికి పెద్దగా నచ్చదు.సాంకేతిక విభాగం :సాంకేతిక విభాగంలో ఎవరికీ వారే తమ టాలెంట్ ని నిరూపించుకోవడానికి తెగ పోటీ పడ్డారు. అందులో డిస్టింక్షన్ మార్క్స్ కొట్టేసింది ముగ్గురు.. వాళ్ళే అనూప్ రూబెన్స్, జయనన్ విన్సెంట్, సాయి మాధవ్ బుర్రా. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఎంత బాగున్నాయో ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ అంతకన్నా బాగుంది. ముఖ్యంగా పాత్రల స్వభావాలని బట్టి ఇచ్చిన డిఫరెంట్ మ్యూజిక్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఇకపోతే జయనన్ విన్సెంట్ స్టార్ హీరోలను చూపించిన విధానం ఫెంటాస్టిక్ అని చెప్పాలి. దేవుడుగా పవన్ ని చూపించిన విధానం అదిరిపోయింది. సింపుల్ గా చెప్పాలి అంటే చాలా రోజుల తర్వాత దేవుడంటే ఇలానే ఉంటాడేమో అనే ఫీలింగ్ ని తన విజువల్స్ తో ఆడియన్స్ కి కలిగించాడు. వారణాశిని చూపించిన విధానం, భజే భాజే పాటలో విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. సాయి మాధవ్ బుర్రా డైరెక్టర్ రాసుకున్న సీన్స్ కి తన అర్థవంతమైన డైలాగ్స్ తో ప్రాణం పోసాడు. అతని డైలాగ్స్ ఆ రేంజ్ లో లేకపోతే సినిమాలో కంటెంట్ మిస్ అయిపోయేది. ఎడిటర్ గౌతంరాజు ఓవరాల్ రన్ టైంలో ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది.ఇక ఈ సినిమా కథనం – దర్శకత్వ విభాగాలను డీల్ చేసింది కిషోర్ కుమార్ పార్ధసాని(డాలీ).. డాలీ కథనం విషయంలో లెంగ్త్ ని తగ్గించి ఇంకాస్త స్పీడ్ గా ఉండేలా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది. కానీ డైరెక్టర్ గా మట్టం మంచి మార్కులే కొట్టేసాడు. ఎందుకంటే పైన చెప్పినట్టు ఒరిజినల్ కంటెంట్ ని పక్కాగా చెప్పలేకపోయినా కాంబినేషన్ సీన్స్ ని మాత్రం చాలా బాగా డీల్ చేసాడు. అందుకే సినిమా అంతలా ఆడియన్స్ కి నచ్చుతుంది. బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు హై రేంజ్ లో ఉన్నాయి. ఆన్ స్క్రీన్ చూసే ప్రతి విజువల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది.తీర్పు :తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ – వెంకటేష్ ల ‘గోపాల గోపాల’ సినిమా 2015 తొలి తెలుగు హిట్ సినిమాగా నమోదైంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మల్టీ స్టారర్ మూవీ అభిమానులనే కాకుండా, కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మాయ మాటలు చెప్పే బాబాజీలను నమ్మకండి, దేవుడు ఎక్కడో లేడో మీలోనే ఉన్నాడు, మీ ధైర్యం, మీరు చేసే ధర్మమే దేవుడని చెప్పిన పాయింట్ అందరికీ బాగా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, వెంకటేష్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్, పవన్ – వెంకీల కాంబినేషన్ సీన్స్, విజువల్ వండర్ గా అనిపించే భాజీ భాజే సాంగ్ ఈ సినిమా చూస్తున్న వారి మదిలో అలా నిలిచిపోతాయి. సినిమా లెంగ్త్ ని తగ్గించి కంటెంట్ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘గోపాల గోపాల’ సినిమా ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన ఎమోషనల్ ఎంటర్టైనర్ విత్ గుడ్ కామెడీ అండ్ మెసేజ్. కొస మెరుపుగా ఇలాంటి ఓ మంచి కాన్సెప్ట్ ని తెలుగు ప్రేక్షకులకు అందివ్వడానికి ట్రై చేసి ట్రెండ్ సెట్ చేసిన ఈ చిత్ర టీంకి మా సెల్యూట్.. జై హింద్
Rating: 3.5/5-

No comments:

Post a Comment