Sunday 1 March 2015

సునీల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

సునీల్‌ కథానాయకుడిగా ఆర్‌పిఏ క్రియేషన్స్‌ పతాకంపై ఆర్‌.సుదర్శన్‌ రెడ్డి ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తారు. శనివారం సునీల్‌ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమా ‘ప్రేమకథా చిత్రమ్‌’ చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల అంచనాలు అందుకునే కథ కోసం ఇంతకాలం ఎదురుచూశాం. వంశీకృష్ణ చక్కని కథతో నా దగ్గరికొచ్చారు. కథ విన్న వెంటనే నేనూ, సునీల్‌ అంగీకరించాం. సునీల్‌కి యాప్ట్‌ అయిన కథ ఇది. ఆయన నుండి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఇందులో సునీల్‌ బాడీ లాంగ్వేజ్‌ కొత్తగా ఉంటుంది. పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కునున్న ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో వెల్లడిస్తాం’’ అని అన్నారు. ‘రక్ష’ తర్వాత కమర్షియల్‌ సక్సెస్‌ కోసం చూస్తున్న తనకు అన్ని హంగులు ఉన్న కథ కుదిరిందనీ, సునీల్‌ కథ వినగానే ‘ఇటువంటి కథ కోసమే ఎదురుచూస్తున్నాను’ అని అనడం చాలా ఆనందంగా ఉందనీ దర్శకుడు వంశీకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఆర్‌.ఆయు్‌షరెడ్డి, ఆర్‌.పి.అక్షిత్‌ రెడ్డి.

No comments:

Post a Comment