Sunday, 1 March 2015

ఇప్పుడు టెన్షన్‌ ఎందుకు? - కాజల్‌

‘సినిమాల్లో నటిస్తున్నప్పుడు పబ్లిసిటీని ఎంతగా ఆస్వాదిస్తామో, గాసి్‌ప్సను కూడా అలాగే రిజీవ్‌ చేసుకోవాలి’’ అని అంటోంది కాజల్‌. ఎన్టీఆర్‌ సరసన ఈ భామ నటించిన ‘టెంపర్‌’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా హిట్‌ కావడం పట్ల ఆనందంగా ఉందీ సుందరి. ఆమె మాట్లాడుతూ ‘‘ఉన్నదానికీ, లేనిదానికీ టెన్షన్‌ పడితే కొత్తగా వచ్చేదేమీ ఉండదు. అనవసరంగా ఒత్తిడి గురికావడం నాకిష్టం ఉండదు. అందుకే ఎప్పుడైనా ప్రతికూల విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు ‘సైలెన్స్‌ ఈజ్‌ గోల్డ్‌’ అనే మాటలను గుర్తుచేసుకుంటాను. వాదనలకు దిగకుండా మౌనాన్ని ఆశ్రయిస్తాను. అంతేగానీ పదేపదే జరిగినదాన్నే తలచుకుంటూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. వయసు, అనుభవం పెరిగే కొద్దీ ఈ పరిపక్వత అందరికీ వస్తుందని నా భావన’’ అని వివరించింది కాజల్‌. అన్నట్టు కాజల్‌కి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదట. తనకు మంచి వ్యక్తి తారసపడితే ప్రేమిస్తుందట. ఒకవేళ ఎవరూ నచ్చకపోతే వరుడిని వెతికే బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగిస్తాను అని వివరించిందీ ముద్దు గుమ్మ.

No comments:

Post a Comment