Tuesday 3 March 2015

పోలీస్ పాత్రలో ప్రభాస్

ప్రస్తుతం బాహుబలి షూటింగ్ పూర్తి అయ్యింది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకోసం ప్రభాస్ రెండేళ్ళు కష్టపడ్డాడు. బాహుబలి సినిమా తరువాత్ ప్రభాస్ సినిమా ఏమిటి అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. అయితే వినూత్నంగా తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేసాడు ప్రభాస్. ఇటివలే రన్ రాజ రన్ సినిమాతో మంచి కొట్టిన సుజీత్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపిస్తాడని తెలిసింది. ఈ మద్య టాలీవుడ్ లో హీరోలందరూ పోలీస్ పాత్రలతో హిట్ అందుకుంటున్నారు కాబట్టి ఈ సినేమకుడా అదే నేపద్యం లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట ! మరి ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

No comments:

Post a Comment