రెండో పెళ్లి ప్రయత్నాల్లో చిరు కూతురు
చిరంజీవి రెండో కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఐతే ఓ పాప పుట్టిన తర్వాత శిరీష్ పని చేయకుండా కట్నం తీసుకు రమ్మంటున్నాడని వేధింపులు తట్టుకోలేక పోతున్నానని కోర్టుకెక్కి విడాకులు కూడా పొందిన విషయం కూడా విదితమే . కాగా ఇన్నాళ్ళు శ్రీజ వ్యవహారం మరుగున పడిపోయింది . ఐతే తాజాగా ఫిలిం నగర్ సర్కిల్లో వినబడుతున్న దాని ప్రకారం చిరు రెండో కూతురు శ్రీజ కు మళ్ళీ పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట . మొదటి పెళ్లి చేదు అనుభవాన్ని మిగాల్చగా రెండో పెళ్లి లో అటువంటి ఇబ్బందులు ఏమి రాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారని తెలుస్తోంది. ఐతే శ్రీజ రెండో పెళ్లి వ్యవహారం ఊహగానలేనా లేక నిజమేనా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే
No comments:
Post a Comment