Tuesday 3 March 2015

మంచు విష్ణు కూడా పోటీకి వస్తున్నాడు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఈనెల 29న జరుగనున్న ఎన్నికల సమరానికి సిద్దం అవుతోంది. ఇప్పటికే సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మా అధ్యక్ష పదవికి పోటీకి దిగుతున్నానని ప్రకటించగా తాజాగా మంచు విష్ణు కూడా మా అధ్యక్ష పదవికి పోటీకి దిగాలని భావిస్తున్నాడట . ఒకవేళ ఇద్దరూ రంగంలో కనుక ఉంటే ఎన్నికలు తప్పదు . మరి పోటీని నివారించి ఎవరినో ఒకరిని డ్రాప్ అయ్యేలా సినీ పెద్దలు చేస్తారా లేక ఎన్నికలకు వెళ్తారా చూడాలి . రాజేంద్రప్రసాద్ మాత్రం నేను పోటీకి దిగడం ఖాయమని అంటున్నాడు మరి మంచు విష్ణు ఏం చేస్తాడో చూడాలి

No comments:

Post a Comment