Tuesday 3 March 2015

ఒక్క సినిమాలో 24 పాత్రలు చేస్తున్న హీరో

వినడానికే ఇది ఆశ్చర్యంగా ఉన్న నిజం ? ఇప్పటికే మనం సౌత్ ఇండియాలో అప్పట్లో అక్కినేని నవరాత్రి అనే సినిమాలో తొమ్మిది పాత్రలు పోషించి ఔరా అనిపించాడు. ఆ తరువాత కమల్ హసన్ దశావతారం సినిమాలో పది పాత్రలో పోషించాడు. కాని లేటెస్ట్ గా ఈ హీరో మాత్రం ఏకంగా 24 పాత్రలు పోషించడానికి రెడీ అవుతున్నాడు? అవును ఆ హీరో ఎవరో కాదు ? టైటానిక్ హీరో లేయోనార్దో డి కాప్రియో ! ఈ హీరో 24 పాత్రల్లో నటించి చరిత్ర శ్రుష్టించడానికి రెడీ అవుతున్నాడు. క్రౌడేడ్ రుం అనే సినిమాలో అయన నటిస్తున్నాడు. నిజంగా ఈ టైటానిక్ హీరోకి ఇది అగ్ని పరీక్షే ? 1981 లో వచ్చిన ఓ పాపులర్ నవల ఆధారంగా ఈ సినిమా ఉంటుందట. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఇప్పటికే హాలీవుడ్ లో మొదలైంది

No comments:

Post a Comment