Tuesday 3 March 2015

పోకిరి+టెంప‌ర్‌= ప్ర‌భాస్ సినిమా!

బాహుబ‌లి త‌ర‌వాత ప్ర‌భాస్ ఏ సినిమా ఒప్పుకొంటాడు?? ఎలాంటి పాత్ర‌ల్లో క‌నిపిస్తాడు?? ప్ర‌స్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఈ విష‌య‌మై ఆస‌క్తిగా చ‌ర్చించుకొంటున్నారు. రెండేళ్ల పాటు ఒకే గెట‌ప్‌లో ఉండి.. ప్ర‌భాస్ కి విసుగు పుట్ట‌డం ఖాయం. రెగ్యుల‌ర్ యాక్ష‌న్ సినిమాల‌వైపు క‌న్నెత్తి కూడా చూడాల‌నిపించ‌దు. అందుకే.. ర‌న్‌రాజార‌న్ ఫేమ్ సుజిత్‌తో ఓ కామెడీ సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యాడు. త‌క్కువ బ‌డ్జెట్‌లో త‌క్కువ రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేస్తార‌ట‌. ఆ త‌ర‌వాత మాత్రం ప్ర‌భాస్ ఫుల్ లెంగ్త్ మాస్ రోల్‌లో క‌నిపిస్తాడ‌ని టాక్‌. ప్ర‌భాస్ ఎప్ప‌టి నుంచో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించాల‌ని అనుకొంటున్నాడు. ప్ర‌భాస్ బాడీకీ, సిక్స్ ప్యాక్ దేహానికి అలాంటి పాత్ర‌లు భ‌లే సూట‌వుతాయి. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ ముచ్చ‌ట తీర‌లేదు. ఈసారి ఎలాగైనా పోలీస్ గా క‌నిపించాల‌ని డిసైడ్ అయిపోయాడ‌ట‌. పూరి జ‌గ‌న్నాథ్‌కి కూడా `పోలీస్ క‌థ‌లుంటే చెప్పు డార్లింగ్‌` అని అడిగాడ‌ట‌. పూరి కూడా పోకిరి, టెంప‌ర్ రేంజులో ప్ర‌భాస్ కోసం ఓ క‌థ రెడీ చేయ‌బోతున్న‌ట్టు టాక్‌. మొత్తానికి ప్ర‌భాస్ కోరిక పూరితో తీరుతుంద‌న్న‌మాట‌.

No comments:

Post a Comment