Tuesday, 24 February 2015

వరుడికి హ్యాండిచ్చి లేచిపోయిన వధువు

మరికొద్ది గంటల్లో పెళ్లి జరుగబోతోంది అన్న సంతోషంలో పెళ్లి రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసుకొని వధూవరుల బంధువులతో పాటు కొత్త పెళ్లి కూతురు ,పెళ్లి కొడుకు కలిసి డ్యాన్స్ చేసారు ,ఆనందంగా గడిపారు అలసిపోయి తెల్లారి పెళ్ళికి రెడీ కావాలి కాబట్టి ఫంక్షన్ హాల్ లోని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి నిద్రలోకి జారుకున్నారు. కానీ పెళ్ళికూతురు మాత్రం తనగదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని వంటిపై ఉన్న బంగారమంతా ఓ మూట గట్టి అందరూ నిద్రలోకి జారుకున్న క్షణాన ఆ ఫంక్షన్ హాల్ నుండి మెల్లిగా జారుకుంది ,తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని తీరిగ్గా తన తల్లిదండ్రులకు జరిగిన విషయన్ని గురించి చెప్పింది. అప్పటికే పెళ్లి కూతురు కనిపించడం లేదని కంగారు పడుతున్నవాళ్ళకి ఈ విషయం తెలియడంతో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ లో జరిగింది.పెళ్ళికూతురు హ్యాండిచ్చి లేచిపోవడంతో  పెళ్లి కొడుకు రామచంద్రప్ప కుమిలి పోతున్నాడు. 

No comments:

Post a Comment