Tuesday, 24 February 2015

ఆకాశం నుంచి కాసుల వర్షం

 : ఆకాశం నుంచి మామూలుగా అయితే వర్షం, మహా అయితే వడగళ్ల వర్షం కురుస్తాయి. అదే, మనం ఊహించని విధంగా ఆకాశం నుంచి హఠాత్తుగా కాసుల వర్షం కురిస్తే...మరో ఆలోచన లేకుండా వాటిని ఏరుకునేందుకు ఎగబడతాం. అది మానవ నైజం కూడా. దుబాయ్ నగరం వీధుల్లో ఇటీవల అచ్చం ఇదే జరిగింది. కారుల్లో ప్రయాణిస్తున్న వారు కూడా ఎక్కడి కార్లను అక్కడే నిలిపేసి ఆ కాసులను ఏరుకునేందుకు పోటీపడ్డారు. ఫలితంగా పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయిందట.

అలా కురిసింది చిల్లర పైసలు కాదు. ఏకంగా 500 దినార్ల విలువైన నోట్లు... సుమారు 88 పాండ్లు...అలాంటి నోట్లు వందలు, వేల నోట్లు... వాటి విలువ సుమారు రూ. 4.81 కోట్లు ఉంటుందని అధికారిక అంచనాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా దుబాయ్‌లోని జుమీరా ప్రాంతంలో ఆ నోట్ల వర్షం కురిసిందని, అప్పుడు గాలి దుమారం, ఈదురు గాలులు బలంగా వీచాయని స్థానికులు తెలియజేశారు. ఎక్కువ మంది నోట్లను ఏరుకోవడంలో నిమగ్నం కాగా కొంత మంది ఆ దశ్యాలను తమ తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఆకాశం నుంచి దాదాపు ఐదు లక్షల పౌండ్లు విలువైన కరెన్సీ కురిసినట్టు వెల్లడించిన అధికారులు మాత్రం అలా కాసులు కురవడానికి కారణం ఏమిటో ఈ రోజుకు వెల్లడించలేక పోతున్నారు.

No comments:

Post a Comment