Tuesday 24 February 2015

చిరంజీవి 150 సినిమాకి దర్శకుడు పూరి

టెంపర్ సక్సెస్ తో మాంచి ఊపుమీదున్న దర్శకుడు పూరి జగన్నాద్. తాజాగా చిరంజీవి 150వ చిత్రానికి దర్శకులు పూరి జగన్నాద్ అని వినిపిస్తోంది. చిరంజీవి తన 150వ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో టెంపర్ మెంట్ తో ఉన్న పూరి అయితేనే బాగుంటుందని భావిస్తున్నారట చిరు . ఇక చిరంజీవి 150వ చిత్ర కథ కి పరుచూరి బ్రదర్స్ తుదిమెరుగులు దిద్దుతున్నారు. అయితే కథ మాత్రం బివిఎస్ రవి అందించారని సమాచారం. చిరు వందో సినిమాకి ఫలానా దర్శకుడు అంటూ చాలామంది దర్శకుల పేర్లే వినిపించాయి కానీ తాజాగా వినిపిస్తున్న పేరు మాత్రం పూరి కాబట్టి త్వరలోనే దర్శకులు ఎవరు ? సినిమా ఎప్పటినుండి అనేది త్వరలోనే తెలియనుంది . 

No comments:

Post a Comment