Tuesday 24 February 2015

ఆ క్లాసిక్ ని చెడగొట్టేలా ఉన్నాడు ఈ హీరో

లవకుశ తెలుగు ప్రజలకు అజరామరమైన చిత్రం . ఇప్పటికీ ప్రతీ గ్రామంలోని గుడిలో వినిపించే అద్భుతమైన పాటలు ఆనాటి లవకుశ చిత్రం లోనివి. పైగా ఎన్టీఆర్ ,అంజలి నటించిన ఆ చిత్రం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటిది తాజాగా లవకుశ పేరుతో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు హీరో వరుణ్ సందేశ్ . ఇటీవల లవకుశ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ లో ఇద్దరు హీరోయిన్ లను కౌగిలించుకుంటూ ,ముద్దులు పెడుతూ ఆనాటి క్లాసిక్ ని దెబ్బతీసేలా చేస్తున్నాడు ఈ హీరో . లవకుశ అనగానే ఇంటిల్లిపాది ఇప్పటికి కూడా కూర్చొని చూసే అజరామరమైన చిత్రం కానీ తాజాగా వస్తున్న లవకుశ వల్ల ఖచ్చితంగా చెడ్డపేరు రావడం ఖాయమని మండిపడుతున్నారు . 

No comments:

Post a Comment