Wednesday, 4 March 2015

పుట్టినప్పుడు లేని బట్టలు ఇప్పుడెందుకంటోంది

పుటినప్పుడు లేని బట్ట కోసం ఇప్పుడు తెగ తాపత్రయ పడుతున్నారని ఇది కొంతమంది మత చాందసవాదుల పని అని విరుచుకు పడుతోంది రాధికా ఆప్టే . బాలయ్య తో లెజెండ్ చిత్రంలో నటించిన ఈ భామ అంతకుముందు రక్తచరిత్ర చిత్రంలో కూడా నటించింది , తాజాగా మళ్ళీ బాలయ్య తోనే లయన్ అనే చిత్రంలో నటిస్తోంది . కాగా ఈ నాగరిక ప్రపంచంలో ఇంకా నిండుగా కప్పుకోవాలి అంటూ ఆడవాళ్ళపై లేనిపోని ఆంక్షలను పెడుతున్నారని వాపోతోంది . పుట్టినప్పుడు బట్ట కట్టింది లేదు ,పోయేటప్పుడు కట్టుకొని పోయేది లేదు నడుమ ఎందుకీ జంజాటం అంటూ సూక్తులు చెబుతోంది . పాత్ర పరిధి మేరకు నటించాల్సి ఉంటుందని ఆ సమయంలో బట్టల గురించి పట్టించుకోలేమని అంటోంది

No comments:

Post a Comment