Wednesday, 4 March 2015

ఆ హీరో చాలానే నష్టపోయాడట

యాంగ్రీ యంగ్ మాన్ అనగానే టక్కున గుర్తొచ్చే హీరో డా. రాజశేఖర్ . కానీ గతకొంత కాలంగా వరుస పరాజయాలతో రేసులో వెనుకబడిపోగా సొంత చిత్రాలు తీసి ఆర్ధికంగా కూడా చాలానే నష్టపోయాడట ! ఇటీవల రాజశేఖర్ నటించిన ''గడ్డం గ్యాంగ్ '' రాజశేఖర్ సొంత చిత్రం కావడంతో అక్కడ కొంత ఇక్కడ కొంత తీసుకొచ్చి మొత్తానికి ఏదోలా సినిమా కానిచ్చారు ,రిలీజ్ చేసారు కానీ బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం బాల్చీ తన్నేయడంతో రాజశేఖర్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని అంటున్నారు . ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఆ సినిమా క్షవరం చేసేసిందని బాధపడుతున్నారట . చేతిలో సినిమాలు కూడా లేకపోవడంతో బాగానే బాధపడుతున్నారట రాజశేఖర్ . నాలుగు కోట్లపైనే గడ్డం గ్యాంగ్ క్షవరం చేసిందని అంటున్నారు . దాంతో రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అవ్వాలని భావిస్తున్నాడని సమాచారం . 

No comments:

Post a Comment