Wednesday 4 March 2015

మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేయనన్న నాగార్జున

మా టివిలో గత రెండు సీజన్స్ లో సందడి చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఈ షో మొదటి సీజన్ కంటే రెండో సీజన్ కు కాస్త క్రేజ్ తగ్గింది. అయితే రెండో సీజన్ కుడా పూర్తి అయ్యింది. ఈ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఇకపై ఈ షో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న నాగార్జున ఈ షో చేయడానికి కుదరక పోవడం తో అయన తప్పుకునే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు ఈ షో నిర్వాహకులు ఆలోచనలో పడ్డారట ! ఈ షో లో నాగ్ స్తానం లో ఎవరిని పెట్టాలో అనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్ని నాయన, కార్తి తో కలిసి ఓ సినిమా అలాగే త్వరలో రాఘవేంద్ర రావు దర్శకత్వం లో మరో సినిమా చేయనున్నాడు. మరి ఎం ఎ కె నెక్స్ట్ సీజన్ లో ఎవరు వస్తారో చూడాలి ?   

No comments:

Post a Comment