Sunday, 22 February 2015

వీరి పారితోషికం ఎంతో తెలుసా?

మీలో ఎవరు కోటీశ్వరుడు? అనడిగితే హిందీ చిత్రసీమలోని కథానాయకులంతా చేయి పెకైత్తుతారు. పారితోషికాల విషయంలో ఒకరిని మించి ఒకరున్నారు. ఒక్కొక్కరిది కళ్లు తిరిగిపోయే పారితోషికం. ఒక్క రెమ్యునరేషన్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా తీసేయొచ్చును. అయినా డిమాండ్ అండ్ సప్లయ్ అనే రూల్ ఒకటుంటుంది కదా. పిండి కొద్దీ రొట్టె. బాక్సాఫీస్ వసూళ్ల బట్టే రెమ్యునరేషన్లు. 

హయ్యెస్ట్ రెమ్యునరేషన్లు అందుకుంటున్న టాప్ 7 స్టార్స్ గురించి సరదాగా తెలుసుకుందాం.

 
సల్మాన్ ఖాన్ @ 50 కోట్లు
షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్.. ఇలా యువ హీరోలు ఎంతమంది వచ్చినా 50 ఏళ్ల సల్మాన్ ఖాన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్లే బోయ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ కండల వీరుడు చేసేవన్నీ రెగ్యులర్ కమర్షియల్ మూవీసే. అన్నీ దాదాపు విజయం సాధిస్తున్నాయి. దాంతో మార్కెట్లో ఈయన గారి స్థానం బ్రహ్మాండంగా ఉంది. అందుకే.. 50 నుంచి 55 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు.
 
అక్షయ్ కుమార్ @ 45 కోట్లు
ఒకానొక దశలో బాలీవుడ్ కలక్షన్ కింగ్ అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. రెగ్యులర్ మూవీస్‌తో పాటు వినూత్న తరహావి కూడా చేయడం అక్షయ్ స్టయిల్. మినిమమ్ గ్యారంటీ హీరో అని హిందీ రంగంలో కొంతమంది నిర్మాతలు అంటుంటారు. ఆ ఇమేజ్ సొంతం చేసుకున్నారు కాబట్టే, ఎంచక్కా అక్షయ్ 45 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.
 
ఆమిర్ ఖాన్ @ 40 కోట్లు
సల్మాన్ ఖాన్‌లా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు కాకుండా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తుంటారు ఆమిర్ ఖాన్. సినిమా జనాల్లోకి వెళ్లే వరకూ హిట్టవుతుందా? లేక ఫ్లాపా అనే సందిగ్ధత ఉంటుంది. ఆమిర్ తీసుకునేవి అలాంటి రిస్కులు మరి. ఇలా రిస్కీ మూవీస్ చేస్తున్న ఆమిర్ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? దాదాపు 40 కోట్లు. 50 తీసుకుంటే ఏం పోతుంది? అని ఆయన అభిమానులు అనుకోవచ్చు. మరి.. ఆమిర్ ఎందుకంత డిమాండ్ చేయరో? ఆయనకే తెలియాలి.
 
అజయ్ దేవగన్ @ 35 కోట్లు
అజయ్ దేవగన్ మంచి మాస్ హీరో. ఈ మధ్యకాలంలో చేసిన సింగమ్, రౌడీ రాథోడ్ వంటి చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. షారుక్, అజయ్ మార్కెట్ రేంజ్ దాదాపు ఒకటే. అందుకే షారుక్ తీసుకుంటున్నట్లే 35 కోట్లు డిమాండ్  చేస్తుంటారు అజయ్.
 
షారుక్ ఖాన్ @ 35 కోట్లు
బాలీవుడ్ బాద్‌షా అనే ఇమేజ్ సొంతం చేసుకున్న షారుక్ ఖాన్ కూడా సల్మాన్‌లా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చేస్తారు. ఈయన గారికీ బోల్డంత క్రేజ్ ఉంది. కాకపోతే సల్మాన్‌లా 50 కోట్లు అడిగితే నిర్మాతలు వెనకడుగు వేస్తారు. అందుకే, తన మార్కెట్‌కి తగ్గట్టుగా 35 కోట్లతో షారుక్ సరిపెట్టుకుంటున్నారు.
 
హృతిక్ రోషన్ @ 25 కోట్లు
ఆరడుగుల అందగాడు హృతిక్ రోషన్‌కి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, సినిమా సినిమాకీ కొంచెం గ్యాప్ తీసుకోవడం ఓ మైనస్. సక్సెస్ రేట్ కూడా ఇంతకుముందు చెప్పిన ఐదుగురి హీరోల స్థాయిలో ఉండదు. అందుకేనేమో.. 25 కోట్ల పారితోషికంతో హృతిక్ సరిపెట్టుకుంటున్నారు.
 
రణబీర్ కపూర్ @ 20 కోట్లు
చాక్లెట్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రణబీర్ కపూర్ కెరీర్‌ని ‘బర్ఫీ’కి ముందు.. ఆ తర్వాత అని చెప్పాలి. ఈ చిత్రవిజయంతో పాటు ‘యే జవానీ హై దీవానీ’ చిత్రవిజయంంతో రణబీర్ మార్కెట్ పెరిగింది. అందుకే 20 నుంచి 25 కోట్లు లోపు తీసుకుంటున్నారు. యువ హీరోల్లో ఈయనగారి పారితోషికమే ఎక్కువ అట.
 
ఇదండీ... బాలీవుడ్ కరోడ్‌పతుల కహానీ. మిగిలిన హీరోలు కూడా తక్కువేమీ కాదు. షాహిద్‌కపూర్, రణ్‌వీర్ సింగ్, ఇమ్రాన్ ఖాన్ వంటి హీరోలు 10 కోట్లు నుంచి 15 కోట్లు లోపు తీసుకుంటున్నారు. బాలీవుడ్డా... మజాకానా!

No comments:

Post a Comment