Monday, 23 February 2015

అందుకే పవన్ తో సినిమా చేయలేదు...

అందుకే పవన్ తో సినిమా చేయలేదు...

Feb 22, 2015 at 11:20 AM
 
బుల్లితెర హాటెస్ట్ యాంకర్ ఎవరైనా ఉన్నారా అని అంటే టక్కున అనసూయ పేరు చెప్పేస్తారు ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులు. ఈమె ఏదైనా చాలా బోల్డ్ గా మాట్లాడేస్తుంది. ఈ సెక్సీ యాంకర్ నిన్న సాయంత్రం ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్ లో అందం అంటే నువ్వా అనే లైవ్ షోలో పాల్గొంది. ఈ షోలో తనకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను పంచుకుంది. తనను కొంతమందిఆంటీ’ అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారనిఅవన్నీ పట్టించుకోనని తెగేసి చెప్పేసింది. 
అంతేకాదండోయ్ పెళ్లయి సూపర్ హీరోలుగా చలామణి అవుతున్న హృతిక్ రోషన్రామ్ చరణ్అల్లుఅర్జున్‌లు క్రేజీ హీరోలుగా నటిస్తుంటే తనకు పెళ్లయి పిల్లులున్నంత మాత్రాన హాట్ యాంకర్ కాకుండా పోతానా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తోంది.  
ఇంకా మాట్లాడుతూ... తను అత్తారింటికి దారేది’ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్‌లో చేయకపోవడంపై ఎవరిష్టం వచ్చినట్లు వారు కామెంట్లు చేశారనీకానీ తనకు పవన్ వెంట ప్రామినెంట్ క్యారెక్టర్ లో చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. అంటే హీరోయిన్ గా కోరుకుంటుందేమో...అన్నట్లు గబ్బర్ సింగ్ 2 చిత్రంలో సెకండ్ హీరోయిన్ పోస్టు ఇంకా భర్తీ కాలేదట. మరి పవన్ ఈ అనసూయ మాటలు విని ఏదైనా చెపుతారేమో... చూద్దాం...!!

No comments:

Post a Comment