Monday 23 February 2015

ఆ మెగా హీరోతోనే రాజమౌళి నెక్స్ట్ సినిమా

టాలీవుడ్ క్రేజీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమా దాదాపు పూర్తీ కావొచ్చింది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ లో మొదటి పార్ట్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అత్యంగా భారి స్తాయిలో రూపొందించిన ఈ సినిమా రెండో పార్ట్ కుడా అక్టోబర్ లో విడుదల చేస్తారట ! అయితే ఈ సినిమా తరువాత జక్కన్న నెక్స్ట్ సినిమా ఏదనే విషయం పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి మొదలైంది. అయితే రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను ఇప్పటికే ఓకే చేసారని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన చర్చలు కుడా జరిగాయట ! అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఆ మద్య ఇదే బ్యానర్ లో రామ్ చరణ్ తో మగధీర చిత్రాన్ని రూపొందించి సంచలన విజయం సాదించిన విషయం తెలిసిందే . మల్లి అదే స్తాయిలో ఈ సినిమా ఉండనుందట ! ఈ సినిమా 2016లో ప్రారంబం అయ్యే అవకాశం ఉంది

No comments:

Post a Comment