Monday, 9 March 2015

పవన్‌ నో చెప్పిన ఈవెంట్‌కు గెస్ట్‌గా మహేష్‌ ..?

తెలుగు సినిమా ప్రేక్షకుల్లో పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్‌ కళ్యాణ్‌ సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వినిపించినా.. పవన్‌ ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్‌ వెంటనే ఎలర్ట్‌ అవుతారు. ఇంతటి ఫాలోయింగ్  ఉన్న పవన్‌ కళ్యాణ్‌‌‌ను తాము నిర్వహించే వార్షిక వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానించిందట అమెరికాలోని తానా. జూలైలో జరగబోయే ఈ ఈవెంట్‌కు రావాలని ఎంతగానో రిక్వెస్ట్ చేసిందట. అయితే పవన్‌ మాత్రం తాను ఈ వేడుకలకు రాలేనని వారికి చెప్పేశాడట. ఎంతోమంది ప్రముఖులు పవన్‌‌ను రావాలని కోరినా.. వ్యక్తిగత పనులు ఉన్నాయంటూ తానా నిర్వాహకులకు తేల్చిచెప్పాడట పవర్‌‌స్టార్.
దీంతో ఈ వేడుకకు అతిధిగా ప్రిన్స్‌ మహేష్‌ను రావాలని కోరగా...మహేష్‌ అంగీకరించాడట.

No comments:

Post a Comment