ఆలీపై యాంకర్ సుమ ఫైర్…బూతు జోకులు ఆపమని వార్నింగ్
ప్రముఖ నటుడు ఆలీకి యాంకర్ సుమ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఆదివారం జరిగిన సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్‌లో వీరిద్దరు వ్యాఖ్యాతలుగా ఉన్నారు.
ఆలీ అల్లు అరవింద్‌ను స్టేజ్‌పైకి ఆహ్వానించినప్పుడు మాట్లాడుతూ అరవింద్ గారు ట్రైలర్ లాంచ్‌కు ఎక్కడ నొక్కాలి..ఎక్కడ నొక్కాలి అని నన్ను అడిగారు. సుమను ఆడగలేదంటూ పెద్ద ద్వందార్థంతో కూడిన జోక్ వేశాడు.
వెంటనే అందరూ నవ్వుకున్నా సుమ మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. అయితే దేవుడా అని స్టేజ్‌పై ఆమె ఇబ్బంది బయట పెట్టలేదు.
కార్యక్రమం ముగిసిన తర్వాత ఆలీకి మరోసారి ఇలాంటి కుళ్లు జోకులు వేస్తే బాగోదని సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట. ఇటీవల కాలంలో ఆలీ స్టేజ్ షోల మీద కుళ్లు జోకులు, బూతు డైలాగులు బాగానే పేలుస్తున్నాడు. దీనిపై విమర్శలు వచ్చినా తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు.
No comments:
Post a Comment